రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్ష నేతలతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఈమెతో సమావేశానికి పలువురు ముఖ్యమంత్రులు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ సమావేశం గురించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు కొన్ని విషయాలు మాట్లాడారు.
ఈ సమావేశానికి తమకు నిన్నటివరకూ ఆహ్వానం లేదని.. ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్న విషయంలో జగన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇక ప్రతిపక్షం తమ అభ్యర్థిని నిలబెడుతుందా లేదా అనే విషయం తనకు తెలియదని అన్నారు. ఇక రాహుల్ గాంధీ ఈడీ విచారణ గురించి కూడా స్పందించారు. ఇక మమతా బెనర్జీ సమావేశం గురించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.