AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం కూటమి పార్టీ భారీ విజయాన్ని అందుకోగా వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇలా వైసిపికి 11 స్థానాలు మాత్రమే రావడంతో తిరిగి రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలపరుచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. మూడు పార్టీలు తమ ఉనికిని కోల్పోకుండా కాపాడుకోవడం కోసం సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు.
ఇదిలా ఉండగా వైసిపి ఓడిపోవడంతో వైసిపి పార్టీలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంతో మంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చారు అలాగే మరి కొంతమంది రాజీనామాలు కూడా చేశారు. ఇలా రాజకీయాలకు దూరమైన వారిలో విజయసాయిరెడ్డి ఒకరు. విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటినుంచి ఆ పార్టీలోనే వ్యవహరిస్తున్నారు. జగన్ కి సాయి రెడ్డి కుడి భుజంలా పనిచేస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయం నుంచి ఇద్దరు మధ్య కాస్త దూరం పెరిగినట్టు తెలుస్తుంది. జగన్ ఇతర నాయకుల మాటలను విని విజయసాయిరెడ్డిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది.
ఇలా జగన్ తనని దూరం పెడుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు అయితే నేను ఏ ఇతర పార్టీలలోకి వెళ్ళనని స్పష్టత ఇచ్చారు. ఇక జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయ్ సాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో భాగంగా జగన్ అరెస్ట్ అవుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా విజయసాయిరెడ్డి జగన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరి మధ్య చాలా దూరం పెరిగిందని స్పష్టమవుతుంది.
ఇకపోతే సడన్ గా విజయ్ సాయి రెడ్డిలో వచ్చిన మార్పు ఎన్నో సందేహాలకు కారణం అవుతుంది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. జగన్ గారికి వ్యతిరేకంగా నేను తిరుపతిలో వైజాగ్ లో మాట్లాడినట్టు కొన్ని ఊరు పేరు లేని పత్రికలు, వార్తా చానల్ ప్రచారం చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. జగన్ గారికి వ్యతిరేకంగా ఆన్ రికార్డు ఆఫ్ రికార్డు నేను మాట్లాడినట్టు ఎక్కడా లేదు. కేవలం కోటరీ కారణంగానే నేను వైసీపీ పార్టీకి దూరమయ్యాను. కానీ జగన్ గారికి వ్యతిరేకంగా ఆయనకు హాని కలిగేలా నేనెప్పుడూ మాట్లాడను అంటూ ఒక్కసారిగా సాయి రెడ్డి యూ టర్న్ తీసుకోవడంతో తెర వెనుక ఏం జరుగుతోంది అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.