AP: వైయస్సార్సీపి పార్టీలో జగన్ తర్వాత అదే స్థాయిలో ప్రాధాన్యత ఉన్నటువంటి నాయకులలో విజయసాయిరెడ్డి ఒకరు. పార్టీలో వచ్చిన విభేదాలు కారణంగా విజయ సాయి రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇలా ఈ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇకపై తాను ఏ పార్టీలలోకి వెళ్ళనని తాను వ్యవసాయం చేసుకుంటాను అంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
విజయ్ సాయి రెడ్డి ఇలా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పకున్న పరోక్ష రాజకీయాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. తరచూ పలువురు రాజకీయ నాయకులతో ఈయన భేటీ అవుతున్నారు. ఇలా సాయి రెడ్డి పరోక్ష రాజకీయాలలో పాల్గొంటున్న నేపథ్యంలో వైసిపి కోటరీ ఈయనపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ముఖ్యంగా ఇటీవల టీజీ జనార్దన్ రెడ్డిని కలవడంతో వైసిపి నేతలు విజయసాయిరెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఇలా తన గురించి జగన్ కోటరీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కాస్త ఘాటుగా స్పందించారు. తాను ఇప్పుడు ఏ రాజకీయాలలోను కొనసాగలేదు ఏ పార్టీతో నాకు సంబంధం లేదు అలాంటిది తాను చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను కలవాలి అనుకుంటే ఎవరికి భయపడేది లేదని, నేరుగా వెళ్లి వాళ్ళని కలుస్తాను తప్ప వారికి సంబంధించిన వ్యక్తులను కలిసే అవసరం నాకు లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ప్రస్తుతం కడపలో మహానాడు జరగబోతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి తనకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ప్రత్యర్థులు కారు అంటూ పోస్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలకు కార్యకర్తలకు విజయసాయిరెడ్డి మంచి బూస్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఇలా తనకు ప్రత్యర్థులు కారని కలవాలనుకుంటే నేరుగా కలుస్తానని విజయసాయిరెడ్డి చెప్పిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈయన తిరిగి రాజకీయ రీఎంట్రీ ఇస్తారనే స్పష్టమవుతుంది.