బ్రాహ్మ‌ణికి మెసేజ్ లు జ‌గ‌న్ కు చెప్పే పెడుతున్నావా? లోకేష్‌!

అధికార ప‌క్షం-ప్ర‌తిప‌క్షం నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మామూలుగా లేదిప్పుడు. టీడీపీ నేత‌ల అరెస్ట్ నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు ఇంకాస్త దూకుడుగా వ్య‌వ‌రించ‌డంతో! అధికార పార్టీ నేత‌లు అదే స్పీడ్ లో ఉన్నారు. తాజాగా అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుల్ని ప‌రామ‌ర్శించిన నేప‌థ్యంలో లోకేష్ సీఎం జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వాట్సాఫ్ లో షేర్ చేయాల‌న్నా! ఫేస్ బుక్ లో షేర్ చేయ‌ల‌న్నా? జ‌గ‌న్ అనుమ‌తి తీసుకోవాలేమో! చివ‌రికి పెళ్లాంతో చాట్ చేయాల‌న్నా! ఆయ‌న‌గారి అనుమ‌తి తీసుకోవాలేమో? అని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లోకేష్ పై ఆ పార్టీ నేత‌, ఎంపీ, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి ధీటైన బ‌ధులిచ్చారు.

బ్రాహ్మ‌ణికి మేసెజ్ లు పెట్టేముందు మ‌రి జ‌గ‌న్ అనుమ‌తి తీసుకుంటున్నావా? లేదా? లోకేష్ అంటూ కౌంట‌ర్లు వేసారు. చేత‌గాని మాట‌ల‌తో సంబంధం లేని మీ ఆవిడ‌ను ఎందుకు మ‌ధ్య‌లోకి లాగుతావా? అంటూ ఎద్దేవా చేసారు. దీంతో లోకేష్ వ్యాఖ్య‌లు…విజ‌య‌సాయి ట్వీట్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ రెండు కామెట్ల‌పై జోరుగా విశ్లేష‌ణ సాగుతోంది. ఈ వ్య‌వ‌హారంలోకి లోకేష్ భార్య‌లంటూ సంబోధించ‌డం పెద్ద త‌ప్పే. సంబంధం లేని విష‌యంలోకి లేడీస్ నీ మ‌ధ్య‌లో కి లాగ‌డం స‌బ‌బైతే కాదు. దానికి విజ‌య‌సాయి అలా కౌంట‌ర్ వేయ‌డం క‌రెక్ట్ కాదు.

నేరుగా లోకేష్ భార్య బ్రాహ్మ‌ణి ని వ్య‌వ‌హారంలోకి తీసుకురావ‌డం హేతుబ‌ద్దం కాదు. పైగా ఇందులోకి రాష్ర్ట సీఎం జ‌గ‌న్ పేరు విజ‌యసాయి తీసుకురావ‌డం ఎంత మాత్రం క‌రెక్ట్ కాదు. విమ‌ర్శ‌లు చేసుకోవ‌డంలో ఓ హ‌ద్దు ఉంటుంది. కానీ ఈ రెండు విష‌యాల్లో లోకేష్‌..విజ‌య‌సాయి హ‌ద్దు మీరారు. ఇటీవ‌లి కాలంలో విజ‌య‌సాయి ట్వీట్లు మ‌రీ వ్య‌క్తిగ‌తంగా ఉంటున్నాయని వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది.

https://twitter.com/VSReddy_MP/status/1276481555624415232?s=19