విజయ్ దేవరకొండని అనకొండ అన్న థియేటర్ యజమాని

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక స్టార్ హీరో గా ఎదిగాడు. అప్పట్లో తన ఆటిట్యూడ్ తో చాలా మంది ఫాన్స్ ని సంపాదించుకున్నాడు. అయితే అదే ఆటిట్యూడ్ ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. కాంఫిడెన్స్ ఉండొచ్చు కానీ, నేనే గ్రేట్, నాకంటే ఎవ్వడూ ఎక్కువ కాదు, నాకు నచినట్టే నేనుంటాను అంటే నడవదు. ఆ తల పొగరు వల్లే విజయ్ కి ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి.

ఈ మధ్య విడుదలైన ‘లైగర్’ సినిమాపై విజయ్, పూరి చాలా నమ్మకం పెట్టుకున్నారు.సినిమా రిలీజ్ ముందు వాళ్లిద్దరూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  భారీ హైప్ క్రియేట్ కావడంతో రెట్టింపు ధరలు చెల్లించి కొన్న బయ్యర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ముంబైకి చెందిన మనోజ్ దేశాయ్ అనే థియేటర్ యజమాని విజయ్ దేవరకొండను తిట్టిపోశాడు. అతని పొగరు కారణంగా నాశనమయ్యానంటూ ఓ రేంజ్ లో ధ్వజమెత్తాడు.

మనోజ్ దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో లైగర్ విడుదలకు ముందు విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ ఓపెనింగ్స్ ని తీవ్రంగా దెబ్బతీశాయి అన్నారు. కావాలంటే నా సినిమాను బాయ్ కాట్ చేసుకోండని చెప్పి విజయ్ పెద్ద తప్పు చేశాడని విమర్శించాడు. విజయ్ నువ్వు కొండవి కావు అనకొండవు. లైగర్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు సర్వం కోల్పోయాను. నీ మాటలు అడ్వాన్స్ బుకింగ్స్ రాకుండా చేశాయి.

నువ్వు ఓ అహంకారివి. వినాశకాలే విపరీత బుద్దులు. పోయే కాలం వస్తే నోటి నుండి ఇలాంటి మాటలే వస్తాయి. నువ్వు పొగరుబోతువి. నీలానే మా సినిమాను కావాలంటే బాయ్ కాట్ చేసుకోండని చెప్పి అమిర్ ఖాన్, తాప్సి, అక్షయ్ కుమార్ నష్టపోయారు. నీ పొగరు వలన లైగర్ కి ఓపెనింగ్స్ దక్కలేదంటూ మనోజ్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఈ ఇంటర్వ్యూ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రెస్ మీట్స్ లో విజయ్ దేవరకొండ చూపించిన యాటిట్యూడ్ నచ్చని నెటిజెన్స్ బాయ్ కాట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ కావాలంటే నా సినిమా బాయ్ కాట్ చేసుకోండి, నచ్చితేనే చూడండి లాంటి పొగరుతో కూడిన కామెంట్స్ చేసి మూవీ దారుణ ఫలితానికి కారణమయ్యాడనేది ఆయన ఆరోపణ.

దీనికి ముందు ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్ కూడా తమ సినిమాలు నచ్చితేనే చూడండి, లేకుంటే లేదు అని పొగరుతో చెప్పారు. ఆ సినిమాలు కనీసం వచ్చాయో లేవో అని తెలియకుండా వెళ్లిపోయాయి. కనీసం వాళ్ళని చూసి అయినా విజయ్ కొంచెం జాగ్రత్త పడితే బాగుండేది.