నా ప్రేమ మొత్తం నీకే అంకితం.. విగ్నేష్ శివన్ ఎమోషనల్ పోస్ట్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న టువంటి నయనతార తన ప్రియుడు విగ్నేష్ చేతితో మూడు ముళ్ళు వేయించుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. మహాబలిపురంలో వీరి వివాహం హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే వీరి వివాహం కూడా పూర్తి అయిందని వీరి వివాహానికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు తరలి వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల నడుమ ఎంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ వీరి వివాహం జరిగింది.

ఇక నయనతార విగ్నేష్ పెళ్లి బంధంతో ఒకటి కాగా విగ్నేష్ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే విగ్నేష్ స్పందిస్తూ.. నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరందరూ అందించిన ప్రేమ ఆప్యాయతలు నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చాయి. మీ ప్రేమకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. ఇక నా జీవితంలో నా ప్రేమ అంతా నయనతారకే అంకితం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ విగ్నేష్ శివన్ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

నా ప్రియమైన కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల నడుమ నేను నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నానంటూ విగ్నేష్ ఈ సందర్భంగా నయనతారతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.