Jamili Election: జమిలి ఎన్నికల గురించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తిరుపతిలో నిర్వహించిన మేధావుల సదస్సులో భాగంగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ టెక్నాలజీ సాయంతో జమిలి ఎన్నికలు నిర్వహించడం పెద్ద కష్టం కాదన్నారు. చాలా సులువుగా ప్రక్రియను పూర్తి చేయొచ్చని చెప్పారు. రాజకీయ కోణంలో జమిలిని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు.
ఎన్నికలు జరిగిన ప్రాంతీయ పార్టీలకు ఏ మాత్రం నష్టం ఉండదని తెలిపారు.ఖర్చు సేవ్ అవుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోవడాన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, పార్టీ ఫిరాయింపులు మంచిదికాదన్నారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల పోటీ చేయకుండా చేయాలని, అలా చట్టంలో మార్పులు తీసుకురావాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానాన్ని అమలులోకి తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. అయితే ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ఎన్నికలు ముందుగా జరగవని 2029లోనే ఈ ఎన్నికలు జరుగుతాయి అంటూ గతంలో చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు అయితే జెమిలి ఎన్నికలు వస్తే బాగుంటుందని మరోవైపు వైసీపీ పార్టీ కూడా భావిస్తుంది. జెమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.