Y.S.Jagan: మిథున్ రెడ్డికి రిమాండ్… చంద్రబాబుపై వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!

Y.S.Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈయనను లిక్కర్ స్కామ్ లో భాగంగా పోలీసులు అరెస్టు చేయడంతో రిమాండ్ కు తరలించారు. ఆగస్టు ఒకటో తేదీ వరకు ఈయనకు రిమాండ్ విధించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని ఇందులో భాగంగా బడా నేతలు హస్తం ఉందని వార్తలు బయటకు వచ్చాయి ఇందులో భాగంగానే గతంలో మరొక ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా సీట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు రెండు సార్లు సీట్ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించారు.

ఇక ఈ లిక్కర్ కేసులో భాగంగా పలువురని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని ఈయనకి కూడా నోటీసులు జారీ చేశారు అయితే ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి ప్రయత్నాలు చేసిన కోర్టు తిరస్కరించడంతో పోలీసులు తనని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విధంగా మిథున్ రెడ్డి రిమాండ్ కు వెళ్లడంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.

ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మిథున్ రెడ్డిపై పెట్టిన కేసు పూర్తిగా అక్రమం. బలవంతంగా మిథున్ రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. లేని లిక్కర్ స్కామ్ ఉన్నట్టు చూపించారు.. అయితే ఈ స్కాం మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హాయామంలో జరిగిందేనని జగన్ తెలిపారు. ఆయన ప్రభుత్వ హాయామంలో జరిగిన ఈ స్కాం కొట్టి వేయించుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ తెలిపారు.

గత ఐదు సంవత్సరాల మా ప్రభుత్వ హయామంలో హయాంలో బెల్టులు షాపులు, పర్మిట్ రూములు తీసేశాం. మద్యం దుకాణాలను కూడా తగ్గించాం. మద్యం స్కాంతో పాటు మరిన్ని కేసుల్లో చంద్రబాబు ఉన్నారు. ఆ కేసులన్నింటిలో ఇప్పుడు దర్యాప్తును నిలిపివేశారనీ ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.