Chinna Jeeyar Swamy: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా చినజీయర్ పేరు మారు మోగుతోంది. కారణం ఆయన వనదేవతలైన సమ్మక్క సారక్కలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడమే. దీనిపై ఇప్పటికే గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో భాగమైన సమ్మక్క సారక్కలకు అక్కడి అడవి బిడ్డలే కాదు వివిధ రాష్ట్రాల నుంచీ వేల సంఖ్యలో భక్తులున్నారు. అడవి తల్లులనే దేవతలుగా భావించే అలాంటి దేవతా సమానులపై చినజీయర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే అలాంటి వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామి క్షమాపణలు చెప్పాలంటూ పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేయగా, మీలాంటి స్వాములు కాషాయం ముసుగులో చేసేది వ్యాపారమే కదా అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూడా స్పందించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జీయర్ ఒక పెద్ద వెదవ అని, ఒకప్పుడు బ్లాక్ టికెట్లు అమ్మిన చరిత్ర కూడా ఆయకుందని ఆయన అన్నారు. అంతే కాకుండా చంద్రబాబు గారిని ఎలాగైనా చిన్న జీయర్ దగ్గరకు తీసుకెళ్లాలని కొందరు పార్టీ నాయకులు ఎంతో ప్రయత్నించారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కానీ ఆయన మాత్రం మనం ప్రజలకు సేవ చేయాలి గానీ, ఇలాంటి వాడి దగ్గరకు వెళ్లి మనం సేవ చేయడమేంటని అన్నారని అశ్వనీధత్ తెలిపారు.
వీడు అవకాశం వచ్చిందంటే చాలు డబ్బులు దోచేయాలని చూసే రకం అని, వీడి బృందంలో మరొక వెదవ కూడా ఉన్నాడని, వాడికీ వీడికీ త్వరలోనే గొడవ కూడా వచ్చే అవకాశముందని అశ్వనీధత్ చెప్పారు. టాపిక్‌ని డైవర్ట్ చేయడానికి ఈ యూజ్ లెస్ ఫెలో మాట్లాడిన పిచ్చివాగుడు ఇది.. వీడేమో ప్రార్ధనలు చేస్తాడు.. సూక్తులు చెప్తుంటాడు.. అలాంటి వెధవ ఇలా మాట్లాడొచ్చా? ఇలాంటి దరిద్రుల గురించి భవిష్యత్‌లో మనం మాట్లాడుకోకూడదు’ అంటూ విపరీతమైన కోపం ప్రదర్శించారు నిర్మాత అశ్వనీదత్.
ఇలా ఈయనొక్కరే కాదు సమ్మక్క సారక్కలను దేవతా మూర్తులుగా కొలిచే ప్రతి ఒక్కరూ చిన జీయర్‌పై ఇప్పుడు తెగ ఫైర్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వనీధత్, చిన జీయర్‌ని వాడు, వీడు అని సంబోధించడం వైరల్‌గా మారింది.