Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న వారిలో చైల్డ్ ఆర్టిస్టు బుల్లి రాజు ఒకరు. వెంకటేష్ కొడుకు పాత్రలో నటించిన ఈ కుర్రాడు తన తల్లిదండ్రులను ఏదైనా అంటే వారిపై బూతులు తిడుతూ విరుచుకుపడ్డారు. అయితే ఈ బుల్లి రాజు పాత్ర పై కొంతమంది పూర్తిస్థాయిలో విమర్శలు చేయగా మరి కొంతమంది మాత్రం సమర్థిస్తూ వచ్చారు..
ఇలా చిన్న పిల్లల చేత బూతులు తిట్టిస్తూ చూపించడంతో ఈ సినిమా చూసిన పిల్లలు ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా అలాగే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి అంటూ విమర్శించడంతో ఈ విమర్శలకు డైరెక్టర్ అనిల్ రావిపుడి ఇప్పుడు చెక్ పెట్టారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి బుల్లి రాజు ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నారు.
బుల్లి రాజు పూర్తి పేరు రేవంత్ ఎన్నికల సమయంలో ఈ కుర్రాడు చేసిన ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో అనిల్ రావిపూడి తనని ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ కుర్రాడు ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా కంగు తింటున్నారు.
ఒకరోజు రేవంత్ షూటింగ్లో పాల్గొనాలి అంటే సుమారు లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్స్ అయినటువంటి బ్రహ్మానందం అలీ వంటి వారు ఒక రోజుకు రెండు నుంచి ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు కానీ ఈ కుర్రాడు మాత్రం ఒక హిట్టుకే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచడం అంటే మామూలు విషయం కాదు. మరి రేవంత్ రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.