వరుణ్ సందేశ్  హీరోగా   చిత్రం ప్రారంభం

బి. యం సినిమాస్ పతాకంపై వరుణ్ సందేశ్ , సీతల్ భట్  జంటగా ఆర్ . యన్  హర్ష వర్ధన్  దర్శకత్వంలో శేషు మారం రెడ్డి మరియు బోయపాటి భాగ్య లక్ష్మి సమర్పణలో  “ప్రొడక్షన్ నెంబర్ 1 ” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలింనగర్  సాయిబాబా దేవాలయంలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారు  ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ గారు  కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో…

హీరో వరుణ్ సందేశ్  మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన అందరి  పెద్దలకు ధన్యవాదములు. దర్శకుడు హర్షవర్ధన్ చెప్పిన కథ విన్న తరువాత నాకు “ఈ కథ నాకు 100% సక్సెస్  ఫుల్ సినిమా అవుతుందని అనిపిస్తుంది. ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న “ఈ మూవీ” లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ రధాన్ మరియు  జవహర్ రెడ్డి  డి ఓ పి ని ఇస్తున్నారు.ఈ సినిమాతో  శీతల భట్  హీరోయిన్ గా చేస్తుంది.   నాకింత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేసి ఈ సంవత్సరం లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని నిర్మాతలు అన్నారు.

చిత్ర నిర్మాత శేషు మారం రెడ్డి , బోయపాటి భాగ్య లక్ష్మి  మాట్లాడుతూ. ఇక్కడకు వచ్చిన హీరోలకు, పెద్దలకు ధన్య వాదములు.హర్షవర్ధన్ ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే  నాకు బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అని చెప్పాను. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. మంచి కథతో తీస్తున్న  ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ…ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలకు, పెద్దలకు ధన్యవాదములు. ఈ మంత్  షూట్ కు వెళ్తున్నాము.మా  సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి  చెయ్యాలని ప్లాన్ చేశాము. నిర్మాతకు ఈ కథ చెప్పగానే కథ బాగుందని ఈ సినిమాకు ఎం కావాలో ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదములు. ఈ సినిమాలో కాశి విశ్వనాథ్ గారు మంచి  క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, శివాజీ రాజా , సునీల్ , ధన్ రాజ్ ,  , మీనా కుమారి

 ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరితో పాటు మంచి టెక్నిషియన్స్  దొరికారు  ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు

నటుడు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ..దర్శకుడు మంచి కథ రాసుకున్నాడు.హర్ష వర్ధన్  చెప్పిన కథ చాలా బాగా నచ్చింది .ఈ సినిమాకు హిట్ కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

ఈ కార్యక్రమానికి  హీరో ధనరాజ్ గారు మరియు  ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు

నటీ నటులు
హీరో : వరుణ్ సందేశ్
హీరోయిన్ : సీతల్ భట్
తనికెళ్ళ భరణి, శివాజీ రాజా , సునీల్ , ధన్ రాజ్ , కాశి విశ్వనాథ్ , మీనా కుమారి
సాంకేతిక నిపుణులు :
బ్యానర్:  బి. యం సినిమాస్
నిర్మాత: శేషు మారం రెడ్డి , బోయపాటి భాగ్య లక్ష్మి
కథ , దర్శకుడు:  ఆర్ . యన్  హర్ష వర్ధన్
కెమెరామెన్: జవహర్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్ :రవి కుమార్ గుర్రం
సంగీతం: రధాన్
కో- ప్రొడ్యూసర్ : ధన తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్ : రవి తేజ పూదారి
పి. ఆర్. ఓ :శ్రీపాల్ చొల్లేటి