Nayanam Trailer : ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న ఇండియాలో అతిపెద్దదైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5 మరోసారి తనదైన శైలిలో విలక్షణమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించనుంది. అదే ‘నయనం’. వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఒరిజినల్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మంగళవారం నయనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్వాతి ప్రకాష్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, ఎడిటర్ వెంకట కృష్ణ, సినిమాటోగ్రాఫర్ షోయబ్ సిద్ధికీ, అలీ రెజా, డైరెక్టర్ రాజేష్, డైరెక్టర్ శేఖర్, జీ 5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్, రజనీ తాళ్లూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విద్యాసాగర్, జీ5 తెలుగు ఒరిజినల్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ సాయితేజ, జీ 5 చీఫ్ కంటెంట్ ఆఫీసర్, బిజినెస్ హెడ్ అనూరాధ, ప్రియాంక జైన్, హీరో వరుణ్ సందేశ్, వితికా శేరు తదితరులు పాల్గొన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ ( https://youtu.be/SDC-HW8mwMs ) ‘‘నయనం ఫస్ట్ టైమ్ నాకు స్వాతిగారు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇప్పుడదే ఎగ్జయిట్‌మెంట్‌తో మ్యూజిక్ చేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
ఎడిటర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ ( https://youtu.be/tdA6WYk51K8 ) ‘‘ఈ ప్రాజెక్ట్‌లో నన్ను పార్ట్ చేసిన సాధికకు థాంక్స్. ప్రాజెక్ట్ అంతా చాలా బ్యూటీఫుల్‌గా జరుగుతుంది’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ షోయబ్ సిద్ధికీ మాట్లాడుతూ ( https://youtu.be/_C43oGQ6X6U ) ‘‘ఈ జర్నీలో భాగం కావటానికి ఎస్ఆర్‌టీ టీమ్, సాధిక, స్వాతిగారు అందరూ ఎంతో హెల్ప్ చేశారు. విజువల్స్ మెప్పిస్తాయి. డిసెంబర్ 19న నయనం మెప్పిస్తుంది’’ అన్నారు.

యాక్టర్ అలీ రెజా మాట్లాడుతూ ( https://youtu.be/U4Rt1uIBVxk ) ‘‘నా లైఫ్‌లో సినిమాలు ఓ ఫేజ్ వచ్చింది. సినిమాలు రావటం లేదు. వచ్చిన సినిమాలు కంప్లీట్ కావటం లేదు.. కంప్లీట్ అయిన సినిమాలు ఆడటం లేదు. ఆ ఫేజ్‌లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు, మా ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటున్నాను. ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. డబ్బులు వస్తున్నాయి, అంతా బాగానే నడుస్తుంది. కానీ ఏదో మిస్ అయ్యిందనిపిస్తోంది. 20 ఏళ్ల క్రితం బిజినెస్ వదిలి ప్యాషన్‌తో ఇక్కడకు వచ్చాను. ఏదో మిస్ చేస్తున్నామని బాధపడుతుంటే, ఒక నెలలో రెండు ఆఫర్స్ వచ్చాయి. రెండు ఓకే చేశాను. అందులో ఒకటి హిందీలో సీరియల్‌లో నటించే అవకాశం దక్కింది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. స్వాతిగారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అనూరాధగారు నా జర్నీలో ఎప్పుడూ భాగమే. ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. ఏదైనా రోల్ అడిగిన వెంటనే అవకాశం ఇస్తుంటారు. ఇప్పుడు ఈ సిరీస్‌లోనూ ఛాన్స్ ఇచ్చారు. నేను నా బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. వరుణ్ సందేశ్‌ను డిఫరెంట్‌గా చూస్తారు’’ అన్నారు.
వైస్ ప్రెసిడెంట్ – OAP & కమీషనింగ్ జీ తెలుగు & తెలుగు జీ5 – జయంత్ రాఘవన్ మాట్లాడుతూ ( https://youtu.be/ISoscbUr0JA ) ‘‘జీ 5 సక్సెస్ఫుల్ జర్నీలో జీ 5 ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది. స్వాతి స్టోరీ నెరేట్ చేయగానే ఫస్ట్ టైమే అందరికీ నచ్చింది. క్వాలిటీ ప్రాజెక్ట్ వచ్చింది. డిసెంబర్ 19న స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ వచ్చే ఏడాది కూడా మంచి నెంబర్స్ క్రియేట్ చేస్తామని భావిస్తున్నాను’’ అన్నారు.
వైస్ ప్రెసిడెంట్ – తెలుగు ఒరిజినల్ కంటెంట్, తెలుగు జీ5 – సాయి తేజ దేశరాజ్ మాట్లాడుతూ ( https://youtu.be/NP36I6r9rac ) ‘‘ఎప్పుడూ మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తూనే ఉన్నాం. ఈసారి మంచి కంటెంట్‌తో పాటు యూనిక్ కంటెంట్‌తోనూ వస్తున్నాం. తెలుగు ఓటీటీల్లో ఇప్పటి వరకు ఎక్స్‌పీరియెన్స్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో వస్తున్నాం. 2025 ఎండింగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. పది రోజు గ్యాప్‌తో జీ5లో రెండు బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. ఒకటేమో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఇంకోటి నయనం. 2026 కూడా మంచి లైనప్ ఉంది. ఏడాది క్రితం స్వాతిగారు చెప్పిన కథ వినగానే కొత్తగా అనిపించింది. ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ లాస్ట్ ఇయర్ మాకు వికటకవి ఇచ్చారు. ఇప్పుడు నయనం ఇస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ మంచి కంటెంట్‌ను అందించాడు. డైరెక్టర్ స్వాతిగారు చాలా స్ట్రిట్ పర్సన్. సాధికగారు ఫస్ట్ డే నుంచి ఎంతో కష్టపడ్డారు. ప్రతీ ఒక్కరూ బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వటానికి ప్రయత్నించారు. వరుణ్ సందేశ్‌తో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. పోలీస్ క్యారెక్టర్‌లో అలీ రెజాగారు సూపర్బ్‌గా నటించారు. తన పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అన్నారు.
చీఫ్ కంటెంట్ ఆఫీసర్ & బిజినెస్ హెడ్, తెలుగు జీ5 – అనురాధ గూడూరు మాట్లాడుతూ ( https://youtu.be/QCYvWzj1xX8 ) ‘‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో సంగీత్ శోభన్‌ను మా ఫ్లాట్‌ఫామ్‌తోనే లాంచ్ చేశాం. తన కెరీర్ గ్రాఫ్ ఎంత బాగుందో మనం చూస్తూనే ఉన్నాం. స్వాతి ఈ స్క్రిప్ట్‌తో మమ్మల్ని కలిసినప్పుడు ఆమె ప్యాషనేట్ అందరినీ ఎగ్జయిట్ చేసింది. ఇది సైకలాజికల్ థ్రిల్లర్. నటీనటులందరూ ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఎస్ఆర్‌టీ టీమ్ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చింది. భవిష్యత్తులోనూ మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాం. ఇప్పుడు సమాజానికి సరిపోయే కంటెంట్ ఇది’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ( https://youtu.be/NGL-WGAR0NE ) ‘‘రామ్‌గారు, రజినీగారు న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్‌చేయటానికి ఎప్పుడూ ముందుంటారు. అజయ్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తే.. షోయబ్ విజువల్స్ బ్యూటీఫుల్‌గా మెప్పిస్తాయి. ప్రియాంకగారికి థాంక్స్. మేం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడులా వరుణ్ సందేశ్ వచ్చాడు. డిసెంబర్ 19న ఓ మంచి సిరీస్‌తో మీ ముందుకు రాబోతున్నాం’’ అన్నారు.
నిర్మాత రజినీ తాళ్లూరి మాట్లాడుతూ ( https://youtu.be/2d617H65-8s ) ‘‘లాస్ట్ ఇయర్ ఇదే టైమ్‌కి వికటకవి రిలీజైంది. బ్లాక్ బస్టరైంది. జీ5తో కలసి చేస్తోన్న మూడో ప్రాజెక్ట్ ఇది. వికటకవికి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ అందరూ సిరీస్‌కు పని చేశారు. మంచి కంటెంట్‌తో డిసెంబర్ 19న మీ ముందుకొస్తున్నాం’’ అన్నారు.
డైరెక్టర్ స్వాతి ప్రకాష్ మాట్లాడుతూ ( https://youtu.be/TOLCLs6iatg ) ‘‘అనూరాధగారికి, జీ 5 కి ముందు థాంక్స్. ప్రతి డెబ్యూ డైరెక్టర్‌కి ఈ ప్లేస్ ఓ డ్రీమ్. నా డ్రీమ్‌ను నిజం చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. షోయబ్ నా డ్రీమ్‌ను విజువల్‌గా చూశారు. అజయ్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చి ఎన్‌హెన్స్ చేశారు. ఈ పాయింట్‌ను ముందు నమ్మింది సాయితేజగారు. నాతో పాటు ట్రావెల్ అవుతూ ఓ షేప్ తీసుకొచ్చారు. ఆయనకు థాంక్స్. డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇచ్చిన కిరణ్మయిగారికి థాంక్స్. పది మందిలో ఎడెనిమిది మంది పక్కవారిలో లైఫ్ తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సిరీస్. సాధికగారికి స్పెషల్ థాంక్స్. సాగర్‌గారు ప్లానింగ్ ప్రకారం సపోర్ట చేశారు. రజినీ మేడమ్‌గారు డెబ్యూ డైరెక్టర్‌ని నమ్మి చాన్స్ ఇచ్చారు. కథవిని ఒప్పుకున్న వరుణ్ సందేశ్ గారికి థాంక్స్. మా కష్టానికి యూనివర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. డిసెంబర్ 19న జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని చూడండి’’ అన్నారు.

ప్రియాంక జైన్ మాట్లాడుతూ ( https://youtu.be/85E50NTsqVQ ) ‘‘నయనం ప్రాజెక్ట్ నాకెంతో స్పెషల్. స్వాతిగారు ఈ సిరీస్‌ను గొప్పగా చూపించారు. ఇందులో మాధవిగా కనిపించబోతున్నాను. వరుణ్‌గారికి, అలీ రెజా సహా అందరికీ థాంక్స్. డిసెంబర్ 19న నయనం స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
వితికాశేరు మాట్లాడుతూ ( https://youtu.be/fVr4kn4fRLQ ) ‘‘జీ5 ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ డిఫరెంట్ కంటెంట్‌తో మెప్పిస్తుంటారు. ఇంత మంచి కంటెంట్ ఇస్తోన్న జీ5కు థాంక్స్. ఓ లేడీ డైరెక్టర్ దీన్ని తెరకెక్కిస్తున్నారని తెలియగానే వావ్ అనిపించింది. ట్రైలర్ చూడగానే సూపర్బ్‌గా అనిపించింది. తెలుగులో అరుదుగా వచ్చే ప్రాజెక్ట్ ఇది. అజయ్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, షోయబ్‌గారి విజువల్స్ బ్యూటీఫుల్. ప్రియాంక క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయ్యారు. అలీ రెజా చాలా హార్డ్ వర్కర్. యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి. వరుణ్ సందేశ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందోనని ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను. తన లుక్ కూడా బావుంది. తప్పకుండా అందరినీ మెప్పించే సిరీస్ అవుతుంది’’ అన్నారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ( https://youtu.be/3oiJeqnJm5A ) ‘‘శేఖర్ గారు ఈ స్టోరీ గురించి చెప్పారు. స్వాతి, సాధికగారు ఇచ్చిన నెరేషన్ వినగానే షాకింగ్‌లో ఉండిపోయాను. ఏం ఆలోచించకుండా ఎలాగైనా నయన్ క్యారెక్టర్ చేయాలని డిసైడ్ అయిపోయాను. జీ5 టీమ్ ఇలాంటి ఓ వండర్ఫుల్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకులకు తీసుకు వస్తుండటం గొప్ప విషయం. ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ రామ్‌గారు, రజినీగారికి థాంక్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ చేశాననే సాటిస్పాక్షన్‌తో మీ ముందుకు వస్తున్నాను. డిసెంబర్ 19 ఎప్పుడొస్తుందా..ప్రేక్షకులు నయనంను ఎప్పుడెప్పుడు దీన్ని చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. అలీరెజా, ప్రియాంక, రేఖ .. ఇలా అందరూ అద్భుతంగా నటించారు. అజయ్‌గారి మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, షోయబ్ గారి విజువలైజేషన్‌ను స్క్రీన్‌పై చూద్దామా వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు.

