RGV: వర్మ నేను ఒకేసారి సినిమాలు తీశాం. టికెట్ల విషయంలో అపుడు లేని తేడా ఇప్పుడెందుకు వచ్చింది..

RGV: ఆర్జీవీ గారికి సినిమా గురించి తెలియనిదేం కాదు. ఆయన కూడా సెన్సేషనల్ హిట్స్ తీశారని, ఆయన తీయని సినిమా లేదు.. చేయని హిట్ లేదని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అంతే కాకుండా ఆయన దేశం గర్వించే డైరెక్టర్లలో ఆయన కూడా ఒకరు అని భరద్వాజ చెప్పుకొచ్చారు. కానీ ఆయన సినిమాలకు ఎప్పుడైనా నెట్లో రేట్స్ పెంచాడా అని ఆయన ప్రశ్నించారు.

ఇకపోతే తాను అలజడి సినిమా తీసినప్పుడు, ఆర్జీవీ శివ తీసాడని ఆయన చెప్పారు. ఆయనకు ఆ రోజుల్లో కోటో, కోటి 20 లక్షలో అయింది.. తనకు 30 లక్షలు అయిందని ఆయన చెప్పుకొచ్చారు. రెండూ ఒకే టికెట్‌ రేట్‌కి అమ్మాం కదా.. రెండు కథలు కూడా దాదాపు ఒకటేనని ఆయన అన్నారు. మరి ఎంఆర్‌పీ అని రేట్‌ పెట్టి ఆ రోజు ఎందుకు రేట్లు పెంచలేదు అని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత క్షణం క్షణం తీశారు. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా దాదాపు చాలా ఖరీదైన సినిమాలేనన్న తమ్మారెడ్డి చెప్పారు.

ఆర్జీవీ రంగీలా సినిమా చేసినపుడు ఈ వేరియేబుల్ రేట్స్ ఏమీ లేవని, మల్టీఫ్లెక్స్‌లు కూడా పూర్తిగా లేవని ఆయన అన్నారు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చాయని, ఆయన ఇప్పుడు ఇలా అడగడం తనక్కూడా ఆశ్చర్యం వేసిందని వర్మ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించారు.