బరువు సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు చాలా మంది. కూర్చుని పనిచేయడం, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తినడం, వంశపారంపర్యంగా కూడా ఒళ్లు వస్తూంటుంది. ఆహార నియమాలు, వ్యాయామం, యోగా.. తదితర పద్ధతుల్లో బరువును తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే, ఇవి శరీరతత్వాన్ని బట్టి.. అంటే పొడవుగా ఉండే వ్యక్తుల్లో ఒకలా.. పొట్టిగా ఉండే వ్యక్తుల్లో ఒకలా పని చేస్తాయని పరిశోధకులు అంటున్నారు. పొడవుగా ఉన్నవారి కంటే పొట్టిగా ఉన్నవారు బరువు తగ్గేందు ఎక్కువ కష్టపడాలంటున్నారు.
బరువు తగ్గడానికి, ఎత్తుకు సంబంధం ఉందా..? అంటే అవుననే అంటున్నారు. పొడవుగా ఉండే వ్యక్తులు.. పొట్టిగా ఉండే వ్యక్తుల కంటే ఎక్కువ కండరాలు కలిగి ఉంటారట. దీంతో వీరు బరువు తగ్గాలనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు. పొట్టిగా ఉండే వ్యక్తుల్లో కండరాలు తక్కువగా ఉండటం వల్ల కొద్దిగా కష్టపడాలంటున్నారు. వీరిలో కణజాలం, అవయవాలు, ఎముకలు, కండరాలు ఉంటాయి. వీరిలోని తక్కువ కండరాలు (BMR)ను ప్రభావితం చేస్తాయి. వీరికి జీవక్రియ ఎక్కువగా, సక్రమంగా ఉంటే బరువు తగ్గే ప్రక్రియ వేగంగా ఉంటుందని అంటున్నారు. వీటన్నింటితోపాటు మనిషి జీవనశైలి, హార్మోన్లు, నిద్ర, అలవాట్లు.. బరువు తగ్గించే ప్రక్రియలో ప్రభావం చూపిస్తాయి.
ఈక్రమంలో కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అతిగా తినే అలవాటు ఉంటే మానుకోవాలి. ఆహారంలో ఫైబర్ ఉంటే మంచిది. ఆరోగ్య నిపుణులు సూచించిన విధంగా తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. కేలరీల కాలిక్యులేటర్ ద్వారా కేలరీల వినియోగం చూసుకోవచ్చు. బరువులు ఎత్తడం ద్వారా కండరాల శక్తి పెరగడమే కాదు.. వాటి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించాలి.
పొట్టిగా ఉన్నవారు బరువు తగ్గేందుకు కష్టపడాలి.. అయితే నిరుత్సాహం వద్దు అంటున్నారు నిపుణులు. మంచి డైట్, శారీరక వ్యాయామం, ఆహారపు అలవాట్లను సమతూకంలో మెయింటైన్ చేస్తే పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. సరైన ఆహార నియమాలు, శారీరక కసరత్తు ఉంటే బరువు తగ్గడం పెద్ద సమస్య కాదంటున్నారు నిపుణులు.
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించాం. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఆరోగ్యం కోసం సలహాలు పాటించాలన్నా వైద్యులు లేదా ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అర్హులైన వైద్య నిపుణుల సలహాలకు ఇది ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు. ఈ సమాచారానికి ‘తెలుగు రాజ్యం’ ఎలాంటి బాధ్యత వహించదు.