Health Tips: ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పులు రావటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక విధంగా మనం తీయటి పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. అయితే స్వీట్ ఎక్కువగా తినటం వల్ల షుగర్ థైరాయిడ్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇలా మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా స్వీట్ కంటెంట్ శరీరంలోకి ప్రవేశించి నెమ్మదిగా అది షుగర్ వ్యాధికి దారితీస్తుంది. అయితే అటువంటి ఆరోగ్య సమస్యలన్నీటికి చెక్ పెట్టడానికి సహజమైన తీపి పదార్థాలను తీసుకోవాలి. ఆరోగ్యాన్ని సంరక్షించే సహజమైన తీపి పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనకి మార్కెట్లో లభించే చక్కెరకు బదులు చెరుకు నుండి లభించే మరొక తీపి పదార్థం బెల్లం.మనం తీపి పదార్థాలను తినాలి అనుకున్నపుడు బెల్లంతో తయారు చేసిన పదార్థాలను తినటం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనత సమస్యలు నిర్మూలించవచ్చు.
అడవుల్లో లభించే తేనె కూడా సహజమైన స్వీట్నర్ గా ఉపయోగించవచ్చు. స్వీట్స్ తినటానికి ఇష్టపడే వారు చక్కెరకు బదులు తేనె తీసుకోవటం మంచిది. తేనెలో ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. అలాగే ఖర్జూరం కూడా సహజసిద్ధమైన స్వీట్నర్ గా ఉపయోగపడుతుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ ఖర్జూరాన్ని పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఖర్జూరాన్ని బాగా ఎండబెట్టి పొడిచేసి చక్కెరకు బదులుగా ఉపయోగించవచ్చు.
మార్కెట్లో లభించే తెలుపురంగు చక్కెరకు బదులు బ్రౌన్ షుగర్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కొబ్బరి చెట్ల పూల మొగ్గల నుండి తయారుచేసిన ఫామ్ షుగర్ కూడా సహజ సిద్ధమైన స్వీట్నర్ గా ఉపయోగపడి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. దీనిలో గ్లైసెమిక్, ఫ్రక్టోజ్ కంటెంట్ తక్కువగా ఉంటాయి.