‎Upendra: ఆమె లేకపోతే హీరో అయ్యే వాడిని కాదు.. హీరో ఉపేంద్ర కామెంట్స్ వైరల్!

‎Upendra: కన్నడ హీరో,నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడ చిత్రపరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో ఉపేంద్ర ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు. విభిన్న కంటెంట్ చిత్రాలతో ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ఎ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఉపేంద్ర ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను రూపొందిస్తున్నారు.

‎ ఇదిలా ఉంటే సినిమాల్లో తనకు స్పూర్తి, గాడ్ ఫాదర్ ఎవరనే విషయాన్ని వెల్లడించారు ఉపేంద్ర. ఇది ఇలా ఉంటే తాజాగా శుక్రవారం బెంగుళూరులో జరిగిన దివంగత హీరోయిన్ సరోజా దేవి సంతాప సభలో పాల్గొన్న ఉపేంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. సరోజా దేవి లేకపోతే ఈరోజు నేను ఇండస్ట్రీలో లేకపోయేవాడిని. నేను దర్శకత్వం వహించిన ఎ సినిమా విడుదలకు సెన్సార్ సమస్య వచ్చింది.

‎ఆ సమయంలో నటి సరోజా దేవి నాకు మద్దతుగా నిలిచారు. సెన్సార్ చేయమని చెప్పడంతో మేము రివైజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు సరోజా దేవి నన్ను లోపలికి పిలిచి మాట్లాడారు. ఆమె లేచి నిలబడి నన్ను చూసి చప్పట్లు కొడుతూ నేను తీసిన ఎ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆమె మా సినిమాను ఇష్టపడి సెన్సార్ చేసింది. నేను ఆమెను కలిసినప్పుడల్లా, నువ్వు లేకపోతే నేను హీరో అయ్యేవాడిని కాదని నేను ఆమెకు చెప్పేవాడిని. ఆమె నా కెరీర్‌లో నాకు మద్దతు ఇచ్చిన దేవతామూర్తి అని అన్నారు. ఈ సందర్బంగా హీరో ఉపేంద్ర చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.