బాబుకి ఊహించని షాక్.. ఇక రోజువారీ విచారణే

babu jagan

  చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయటంలో దిట్ట అనే విషయం అందరికి తెలిసిందే, చట్టంలో చిన్న చిన్న లూప్ హొల్స్ అడ్డం పెట్టుకొని అనేక కేసుల నుండి బాబు తెలివిగా బయటపడేవాడు. దాదాపు 15 ఏళ్ల క్రితం తన మీద నమోదైన అక్రమాస్తుల కేసు విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అడ్డుపెట్టుకొని విచారణ నుండి తప్పించుకున్నాడు. ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నాడు అనే ఆరోపణలు చేస్తూ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి అప్పట్లోనే చంద్రబాబు మీద కేసు వేసింది. 

babu lakshmi parvathi telugu rajyam

 

 ఆ కేసుపై విచారణ జరగకుండా బాబు స్టే తెచ్చుకుంటూ ముందుకి వెళ్తున్నాడు. అయితే తాజాగా ప్రజాపతినిదుల కేసుల విషయం త్వరగా తేల్చాలని, వాటిపై స్టే ఆరు నెలలుకు మించి వుండకూడదంటూ సుప్రీం కోర్టు చెప్పటంతో బాబు అక్రమాస్తుల కేసులో మళ్ళి కదలిక వచ్చింది. ఈ సారి స్టే లాంటివి తెచ్చుకోవటం కుదరదు కాబ్బట్టి బాబు ఎట్టి పరిస్థితుల్లో ఈ విచారణ నుండి తప్పించుకోలేడు. చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఈ శుక్రవారం విచారణకు వచ్చింది. దీనితో మరోసారి లక్ష్మి పార్వతి సాక్ష్యం నమోదు చేయాలనీ చెపుతూ ఈ నెల 21 కి కేసును వాయిదా వేసింది.

  ఇదే సమయంలో గతంలో బాబు మీద నమోదైన ఓటుకు నోటు కేసు కూడా ముందుకు కదులుతుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి తమ అభ్యర్థి గెలుపు కోసం నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టి ఓటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డితోపాటు పలువురు నిందితులుగా ఉన్నారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ కేసును శుక్రవారం విచారించి సోమవారానికి వాయిదా వేసింది. ఈ రెండు కేసులు కూడా ఇకపై రోజువారీ విచారణ పద్దతిలో జరిగే అవకాశం వుంది. ఇలా రెండు కీలకమైన కేసులు విచారణకు రావటం, చేతిలో అధికారం లేకపోవటం, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ బాబుకు మద్దతు ఇవ్వకపోవటం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు చంద్రబాబు విషయంలో వ్యతిరేకంగా ఉండటంతో బాబుకు కష్టకాలం వచ్చింది.