ఒక నియోజకవర్గానికి ఒకరే ఎమ్మెల్యేగా ఉంటారు కానీ, ఒకే నియోజకవర్గంలో ఇద్దరేసి ఎమ్మెల్యే లు ఎలా వుంటారనే సందేహం వచ్చింది కదా.. కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాలు గమనిస్తే మాత్రం హౌరా నిజమే కదా అని అనిపించకమానదు. నయా ముంబై గా పిలుచుకునే ప్రొద్దుటూరులో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి వాలకం చాలా విచిత్రంగా ఉంటుంది.
2014 ఎన్నికల్లో గెలిచిన కానీ అధికారం లేకపోవటంతో నియోజకవర్గంలో మౌనంగా వుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ ధపా అధికారంలోకి రావటంతో రాచమళ్ళ వ్యవహార శైలిలో చాలా తేడాలు వచ్చాయి. ఆయన బావమరిది మునిరెడ్డి కూడా బావకు నాకు పెద్ద తేడా ఏమి లేదని భావించాడేమో కానీ, ఆయనే ఎమ్మెల్యే అన్నట్లు అక్కడ రాజకీయం చేస్తున్నాడు. నియోజకవర్గంలోని రెవిన్యూ, మున్సీపాలిటీ, పోలీస్ శాఖలపై తన ఆధిపత్యం చూపిస్తున్నాడు.
ఎలాంటి అధికారం లేకపోయినా కానీ, అక్కడ జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో మునిరెడ్డికి పెద్ద పీట వేస్తున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి పని జరగాలన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి, అక్కడ కాంట్రక్టులు అన్ని కూడా మునిరెడ్డి ఆదేశాలు మేరకే జరుగుతాయి. మున్సిపల్ ఆఫీస్ లో ఏ ఫైల్ కదలాలన్న ఆయన ముద్ర తప్పనిసరి అయ్యిందనే మాటలు వినిపిస్తున్నాయి. మునిరెడ్డి వ్యవహారంపై అక్కడి స్థానిక వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. దీనితో పార్టీకి చెందిన చాలా మంది నేతలు రాచమళ్ళకు దూరంగా వుంటున్నారు.
ప్రొద్దుటూరులో జరుగుతున్నా విషయాలన్నీ సీఎం జగన్ ఒక కంట కనిపెడుతూనే ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య కడప పర్యటన కోసం వచ్చిన జగన్ , రాచమళ్ళ శివ ప్రసాద్ ను పట్టుకొని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాలేదా అంటూ అడిగాడు. దీనిని బట్టి చూస్తే ప్రొద్దుటూరు లో జరుగుతున్నా పరిణామాలు జగన్ దృష్టిని దాటిపోలేదని తెలుస్తుంది. మరి ఇప్పటికైనా రాచమళ్ళ తాను మాత్రమే ఎమ్మెల్యే అనే విషయం గ్రహించి, బావమరిది మునిరెడ్డిని పక్కన పెడుతాడో లేక,,, పక్కనే పెట్టుకొని తన పదవికి ఎసరు తెచ్చుకుంటాడో చూడాలి.