వాస్తవాలు తెలియాలంటే వాళ్లను కలవాలి జగన్..?

YS Jagan

2024 ఎన్నికలకు మరో 20 నెలల సమయం మాత్రమే ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వరుసగా ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికలలో గెలుపు కోసం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు ప్రజలను డైరెక్ట్ గా కలుస్తూ వాళ్ల సమస్యలను తెలుసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

వరుసగా జగన్ పార్టీ ప్రతినిధులతో సమావేశాలను నిర్వహిస్తూ పరిపాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. పరిపాలనకు సంబంధించిన లోపాలను తెలుసుకోవడంతో పాటు వైసీపీ కార్యకర్తలతో సమావేశం అవుతూ పార్టీ అభివృద్ధి దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలు సీఎం జగన్ ను కలుస్తున్నారు.

అయితే సీఎం జగన్ తో కార్యకర్తలలో చాలామంది వాస్తవాలను చెప్పే అవకాశం ఉండదు. వాళ్లు వాస్తవాలు చెబితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సీఎం జగన్ ప్రజల సమస్యల గురించి, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోవాలంటే నిపుణులు, విద్యావంతులు, మేధావులతో చర్చిస్తే మంచిదని చెప్పవచ్చు.

వాళ్లు మాత్రమే జగన్ కు వాస్తవాలను వెల్లడించడంతో పాటు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటే జగన్ కు మంచి జరుగుతుందో చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది. పార్టీలకు అతీతమైన వ్యక్తులను జగన్ కలిస్తే పార్టీకి కూడా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. టీడీపీ, జనసేన, వైసీపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తుండగా 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.