రాజకీయనాయకులకు చేతిలో అధికారం ఉండగానే సరిపోదట.. నోటికి పవర్ కూడా ఉండాలంటారు.. ఆ నోటి పవర్‌తో తప్పుచేసిన వాళ్లను చెడుగుడు ఆడుకోవచ్చు.. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీరు తాగించ వచ్చూ.. అలాంటి వారు వైసీపీలో ఎందరో ఉన్నారు.. వారిలో ఆర్కే రోజా, అంబటి రాంబాబులను పేర్కొనవచ్చూ.. ఆర్కే రోజా అయితే లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిందన్న విషయం తెలిసిందే.. ఇక అంబటి రాంబాబు ఏం తక్కువ తినలేదు.. ముఖ్యంగా శాసనసభలో ఆర్కే రోజా, బయట అంబటి రాంబాబులు టీడీపీని ఆటాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అంతే కాదు వైసీపీలో మంచి గుర్తింపు కూడా పొందారు.
అయితే వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వీరికి ఖచ్చితంగా పెద్ద పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ అందరు ఊహించినట్లుగా జరగలేదు.. పైగా వీరిద్దరినీ అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదు అనే ప్రచారం వెలుగులోకి వచ్చింది.. ఇకపోతే రోజాను తీసుకుంటే ఆమె సొంత నియోజకవర్గంలోనే వర్గ పోరును పార్టీ అధిష్టానం ప్రోత్సహిస్తుందంటున్నారు. దీని వల్ల సొంత నియోజకవర్గంలోనే తమ పార్టీ నేతలు గోతులు తీస్తుండటంతో ఆర్కే రోజా మనోవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. అదీగాక నగరిలో తనను ఒంటరిని చేయాలని పార్టీలోని ఒక వర్గం పనిగట్టుకుని ప్రయత్నిస్తుందని రోజా వర్గం ఆరోపిస్తుంది కూడా..
ఇక అంబటి రాంబాబు పరిస్థితి కూడా ఇలాగే తయారు అయ్యిందట. ఇంతవరకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పైగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయనను వ్యతిరేకించే వర్గం తయారయింది. ఈ క్రమంలో వీరిపై చర్యలు తీసుకోవాలని అంబటి అధిష్టానాన్ని కోరినా ఇంత వరకూ పట్టించుకున్న నాధుడే లేడట.. ఇలా విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నాలుకగా వ్యవహరించిన ఈ ఇద్దరు నేతలు అధికారంలోకి రాగానే అంటరాని వారుగా మారారని అనుకుంటున్నారట.. మొత్తానికి వైసీపీలో ఈ ఇద్దరి పొజిషన్ ఇక అంతేనా.. హటం బాంబులు తుస్సు బాంబులు అయ్యాయే.. అని కామెంట్స్ చేసేవారు కూడా లేకపోలేదు.. మరి వీరి రాజకీయ భవిష్యత్తులో ఎదుగుదల అనేది కలగానే మిగిలిపోతుంది కావచ్చూ..