మాజీ సీఎస్ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ -జగన్ సర్కార్ మధ్య ఎన్నికల కమీషనర్ పదవి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసు జూన్ 10న కోర్టులో చర్చకు రానుంది. ఈ తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటికే రాష్ర్ట ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డపై గుంటూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కోవారెంట్ పిటీషన్ దాఖలు చేసారు. నిమ్మగడ్డపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని సాంకేతిక పరమైన లోపాలున్నాయిన్ని దాన్ని ఆధారంగా చేసుకుని హైకోర్టు ఆదేశాల్ని పున సమీక్షించాల్సి ఉంటుందని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో రేపు ఈ కేసు విచారణకు రావడానికి కొన్ని గంటల ముందే నిమ్మగడ్డపై కోవారెంట్ పిటీషన్ దాఖలు అవ్వడంతో ఇదేం ట్విస్ట్ అని ఆశ్చర్యపోవాల్సిన సన్నివేశం ఎదురైంది. దీంతో రేపు సుప్రీం తీర్పు ఎలా ఉన్నా? హైకోర్టులో మళ్లీ కోవారెంట్ పిటీషన్ పై విచారణ జరిగితే? ఎలాంటి వాదనలు తెరపైకి వస్తాయి? తీర్పులో ఏమైనా మార్పులు ఉంటాయా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇక నిమ్మగడ్డను 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ గా నియమించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి జీవో నెం 11ను రిలీజ్ చేసారు. ఇప్పుడా జీవోను కొట్టేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.
అయితే ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనకరాజు ను నియమించారు. కాగా గవర్నర్ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకి తగ్గించినట్టు ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. వాస్తవానికి ఆ పదవిలో 5 ఏళ్లు కొనసాగుతారు. మరి తాజా ట్విస్ట్ నేపథ్యంలో ఎలాంటి వాదనలు తెరపైకి వస్తాయో చూడాలి. అయితే ఈ వ్యవహారమంతా రాజ్యంగబద్దంగానే జరుగుతుండటంతో? ఇప్పట్లో అంత ఈజీగా ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందా? అన్న సందేహాలు అంతే వెంటాడుతున్నాయి.