జగన్ సీఎం పీఠం ఎక్కిన నాటి నుండి ప్రజలకు ఎదో ఒక రూపంలో ఆర్థిక సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇక ప్రతి నెలకు ఎదో ఒక కొత్త పథకం ప్రజల్లోకి తీసుకోని వస్తున్నాడు. అయితే జగన్ తీసుకొస్తున్న పథకాలు ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నాయని, ఒక చేతితో ఇస్తూ మరో చేతితో జగన్ సర్కార్ దండుకుంటుందని ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి సిఎం జగన్ పై విమర్శలు చేసారు. జగన్ మాటలు గాలి మాటలు అని ఆయన విమర్శించారు. రైతు భరోసా కాదు రైతు నిరాశఅన్నారు. ఏడాదికి 12500 అని 5000 కోత పెట్టారు అని ఆయన విమర్శించారు. మద్యపాన నిషేధం అని మధ్యపాణ నిషా చేసారు అన్నారు. అమ్మ ఒడి అని – నాన్న బుడ్డి అమలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన మూడు వేలకు పెన్షన్ పెంచుతామని చెప్పి, తర్వాత విడతల వారీగా పెంచుతూ చివరికి మూడు వేలు చేస్తామని మాట మార్చారు, కనీసం అదేనా చేసారా అంటే అది కూడా లేదు..ఏడాది గడిచిపోయిన కానీ ఇంకా పెంచాలని పెన్షన్ పెంచలేదని ఇల్లు కట్టిస్తాం అని ఇల్లు కూల్చుతున్నారు అని అన్నారు. అగ్రి గోల్డ్ బాధితులకు మోసం చేశారన్నారు. చెల్లమ్మ పెళ్లి కానుకలు ఇవ్వకుండా మోసం చేసారని ఆయన ఆరోపణలు చేసారు. పిఆర్సి అమలు లేదు సీపీఎస్ రద్దు చేయకుండా ఉద్యోగులకు మోసం చేసారని… 45 యేళ్లు దాటితే పెన్షన్ ఇస్తామన్న మాట మోసం చేసారంటూ తులసి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశాడు .. సీఎం జగన్ సొంత జిల్లా కే చెందిన సీనియర్ నేత నోటి నుండి ఇలాంటి ఆరోపణలు రావటం ఇప్పుడు కాస్త సంచలనం అవుతున్నాయి. మరి వాటిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి