Health Tips: వేసవికాలం మొదలైనప్పటి నుండి ఉష్ణోగ్రతలు రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్నాయి.ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు సంభవించే ప్రమాదం ఉంటుంది. వేసవికాలంలో ఉష్ణోగ్రతలకు శరీరం డీహైడ్రేషన్ కు లోనై కళ్ళు తిరిగి పడుకోవటం, కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు శరీరాన్ని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ఎలా ఆహారపదార్థాలలో మార్పులు చేసుకుని ఎల్లప్పుడూ నీటిని తాగుతూ ఉండాలి. శరీరంలోని వేడిని తగ్గించడానికి ఈ టీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం దానిగురించి తెలుసుకుందాం.
సాధారణంగా వేసవికాలంలో కాఫీ టీ తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కీర దోసకాయలు పుదీనా ఆకులను ఉపయోగించి టీ తయారు చేసుకొని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడమే కాకుండా శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది.
కీర దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవికాలంలో కీర దోసకాయలు తినటం వల్ల శరీరానికి
చలువ ఇస్తుంది. పుదీనా ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండి శరీరంలోని వేడిని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి.ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని కోసం 15 పుదీనా ఆకులు, ఒక కప్పు కీర దోసకాయ తురుము వేసి బాగా మరిగించి అందులో రెండు గ్రీన్ టీ బ్యాగులు ఉంచాలి. పదిహేను నిమిషాల తర్వాత ఆ నీటిని వడ పోసి ఆ నీరు చల్లారిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగాలి. ఇలా ప్రతిరోజు వేసవికాలంలో టీ కాఫీలకు బదులు పుదీనా టీ తాగటం వల్ల శరీరంలోని వేడి తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించి అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.