జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. మొదటి రౌండ్ ముగిసే సరికి.. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే 131 డివిజన్ల లెక్కింపు సగం వరకు పూర్తయింది. వీటిలో టీఆర్ఎస్ పార్టీ 48 డివిజన్లలో ఆధిక్యంతో ముందంజలో ఉంది. అలాగే… 9 స్థానాల్లో గెలుపొందింది.
ఇక.. ఎంఐఎం 16 స్థానాల్లో ఆధిక్యంలో.. మరో 16 స్థానాల్లో విజయదుందుబి మోగించింది. బీజేపీ ప్రస్తుతానికి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
హైదర్ నగర్, భారతీ నగర్, సనత్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, బోరబండ, బాలానగర్, రంగారెడ్డి నగర్, ఆర్సీపురంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు.
ఎంఐఎం.. మెహదీపట్నం, రాంనాస్ పురా, దూద్ బౌలి, నవాబ్ సాహెబ్ కుంట, రియాసత్ నగర్, బార్కాస్, తలాబ్ చంచలం, సంతోష్ నగర్, కిషన్ బాగ్, దత్తాత్రేయనగర్, ఫలక్ నుమా, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా, శాస్త్రీపురం, సులేమాన్ నగర్, రెడ్ హిల్స్ లో గెలిచింది.