Rahul: తాజాగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో రాహుల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డాడు. అంతేకాకుండా బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయని.. రైతుల శ్రమతో రాజకీయం చేస్తున్నారని అన్నాడు. ఇక ఈ విషయం గురించి తాము పోరాటం చేస్తామని తెలిపాడు.
దీంతో ఈ విషయం గురించి కవిత స్పందిస్తూ.. ఇవన్నీ ట్విట్టర్లో తెలపడం కాదు.. నిజాయితీ ఉంటే పార్లమెంటులో వచ్చి తమ నిరసన తెలియజేయాలని ఫైర్ అయ్యింది. ఇక మరోవైపు రేవంత్ ఆమెపై ఫైర్ అయ్యాడు. తెలంగాణ ఎంపీలు పోరాటం చేయడం లేదని.. కాలక్షేపం చేస్తున్నారు అని గట్టిగా నిలదీశాడు. అంతేకాకుండా రైతుల మెడకు ఉరి తాడు బిగించింది కేసీఆరే అంటూ ఆ విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించాడు.