Diet For Piles: ఫైల్స్ తో బాధపడుతున్నారా? ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం..!

Diet for piles: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు,ఎప్పుడూ ఒకే చోట కూర్చుని పనిచేయడం, వ్యాయామాలు చేయకపోవడం వంటి వాటి వల్ల ఎక్కువమంది పైల్స్ వ్యాధికి గురవుతున్నారు. హెమరాయిడ్స్ ని సామాన్య పరిభాషలో పైల్స్ అని అంటారు. తెలుగులో వీటిని మొలలు అని అంటారు. పని ఒత్తిడి, కదలకుండా ఒకే చోట కూర్చుని ఉద్యోగం చేసే వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. దీనికి కారణం నీరు తక్కువగా తాగడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, మాంసాహారం ఎక్కువగా తినడం, ఫ్రైలు, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తినడం వంటి వాటి వల్ల ఎక్కువగా పైల్స్ వ్యాధికి గురవుతుంటారు.

మల విసర్జన చేసేటప్పుడు మలద్వారం గోడల నుండి ఫైల్స్ చొచ్చుకొని బయటకి వచ్చి నొప్పి వేయడం, మంట పుట్టడం, రక్తస్రావం జరగడం వంటివి వస్తుంటాయి. మలవిసర్జన అనంతరం రెండు గంటల వరకు కూడా ఈ నొప్పి భాదించే అవకాశం ఉంది. ఒకసారి వస్తే చాలాకాలంపాటు వేధించే సమస్య ఇది. దీనిని మొదట్లోనే గుర్తించి తగ్గించు కోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశాన్ని తగ్గించవచ్చు.

పైల్స్ నివారణకు ఎక్కువగా పీచు పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. పైల్స్ ఉన్న వారు ఎక్కువగా నీరు తాగాలి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, రోజు మల విసర్జన సాఫీగా జరిగేలా చూసుకోవాలి. ఫైబర్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల పైల్స్ సమస్య ఎక్కువ అవుతుంది, కాబట్టి తినే ఆహారం లో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులను తినడం తగ్గించండి. వీటిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండటమే కాకుండా జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది.ఫ్రై చేసిన ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు.

బ్రౌన్ రైస్, చిక్కుళ్ళు, బార్లీ, ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని మీరు రోజూ తినే ఆహారంలో చేర్చుకుంటే ఫైల్స్ సమస్య తగ్గుతుంది. పుచ్చకాయ, అరటిపండు, ఆపిల్ పండ్లు ఎక్కువగా తినటం వల్ల శరీరానికి అధిక శాతం ఫైబర్ అంది పైల్స్ సమస్య తగ్గుతుంది. క్యాబేజీ, కాలిఫ్లవర్, గుమ్మడికాయ, దోసకాయ, తాజా కూరగాయలు తినడం వల్ల పైల్స్ సమస్య నుండి బయట పడవచ్చును.