Belly Fat:ఈ రోజుల్లో చాలా మందిని కలవర పెడుతున్న సమస్య బెల్లీ ఫ్యాట్. మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా ఈ సమస్యతో చాలా మంది యువతీ యువకులు ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా అంధహీనంగ కనిపిస్తున్నారు. పొట్ట ఎక్కువగా ఉన్న కారణంగా ఏ పని చేయాలి అన్న కూడా చాలా అలసట పడుతుంటారు. ఎటువంటి పని చేసిన, ఎక్కువ దూరం నడిచినా కూడా ఆయాసం వస్తుంటుంది. పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెదడ రావడం, ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఫీలవుతుంటారు.
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకొని ఫిట్ గా ఉండాలని అనేక మంది కోరుకుంటారు. అయితే ఇది వారి శరీరాకృతి మీద ఆధారపడి ఉంటుంది.వాకింగ్, యోగా ఇలాంటివి చేయటం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. కానీ బిజీ షెడ్యూల్, బద్ధకం వల్లనో చాలామంది వ్యాయామాలు కొన్ని రోజులు చేసి ఆపేస్తారు. అటువంటి వారికోసం ఒక చిట్కా ను ఇక్కడ సూచిస్తున్నాము. ఈ చిట్కాను అందరూ సులభంగా అనుసరించవచ్చు,అంతే కాకుండా ఇది బెల్లీఫ్యాట్ మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఉదయాన్నే లేచి వాకింగ్ వ్యాయామాలు చేయడానికి బద్దకించే వారికోసం ఇక్కడ సూచించబోయే చిట్కా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఒక పౌడర్ మాత్రమే దీనిని మీరు ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఒకసారి పౌడర్ తయారు చేసుకుంటే ఇది దాదాపుగా రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. దీనిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయం ఇక్కడ చూద్దాం.
మొదటగా జీలకర్ర, నువ్వులు, దాల్చిన చెక్క, కలోంజి సీడ్స్ (బ్లాక్ సీడ్స్) లను సమపాళ్లలో తీసుకొని విడివిడిగా, దోరగా వేయించాలి. బ్లాక్ సీడ్స్ మీ దగ్గరలోని సూపర్ మార్కెట్ లో లభిస్తాయి. తర్వాత వీటిని మిక్సీలో వేసి, మెత్తగా పొడిడి లాగా మిక్సీ పట్టాలి. రోజు ఉదయాన్నే అర టీ స్పూన్ పొడి తీసుకుని అందులో తేనె కలిపి పరకడుపున తీసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది. ఈ పొడి ఉపయోగించడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించడమే కాకుండా శరీర అవయవాలన్నీ యాక్టివ్ గా పని చేయడంలో సహాయపడతాయి. ఈ పద్ధతిని ఒక వారం పాటు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ శరీరం తేలిక అవుతుంది. రోజూ ఉదయాన్నే ఈ పద్ధతిని పాటించడం వల్ల మీ శరీరం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.