Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? జాగ్రత్త ఈ వ్యాధికి సంకేతం కావచ్చు..!

Health Tips: మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతిరోజూ అనేక మంది మధుమేహం బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు అనేకం. భారత దేశంలో కూడా అనేక మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు కనుగొన్నారు తప్ప దీనిని నివారించడం సాధ్యపడదు. మధుమేహ సమస్యలతో బాధపడే వారు అనేక రకమైన ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడవలసి వస్తుంది. చాలామంది దీనిని త్వరగా గుర్తించక పోవడం, ఏమవుతుందిలే అని అలసత్వం ప్రదర్శించడం వల్ల దీని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే కొన్ని రకాల లక్షణాల వల్ల దీనిని త్వరగా గుర్తించవచ్చు. మధుమేహం అనేది అన్ని శరీర భాగాల మీద ప్రభావం చూపుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉన్నట్లయితే మీ నోటి లోని కొన్ని రకాల లక్షణాలు వల్ల దీనిని కనుగొనవచ్చు. కొన్ని సందర్భాలలో సడన్ గా రక్తంలోని చక్కెర స్థాయి పెరుగుతుంది. అప్పుడు దంత, మూత్ర పరీక్షలు తప్పక చేయాల్సిందే. నోటి దుర్వాసన ఎక్కువ అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసుకోవాలి. నోటి దుర్వాసనను హాలిటోసిస్ అని పిలుస్తారు. రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే నోటి నుండి దుర్వాసన వస్తుంది.

మధుమేహం అత్యవసర పరిస్థితిని డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అని అంటారు. ఇది డయాబెటిక్ రోగులలో సాధారణంగా వచ్చే దుర్వాసన అని వైద్యులు తెలిపారు. ఇది కీటోన్ కారకంగా ఉంటుంది. డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయి 250/300 కంటే ఎక్కువ ఉంటే ఏర్పడుతుంది. రక్తంలో కీటోన్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష చేయించుకోవాలి. డయాబెటిక్ కీటోయాసిడోసిస్, హాలిటోసిస్ డయాబెటిక్ రోగులకు ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పరుస్తాయి. రోగులకు ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆందోళనలో ఉంటుంది.