బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రస్తుతం బెంగాల్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బంకించంద్ర చటర్జీ వందేమాతరం రచించిన వందేమాతరం భవన్ ను సందర్శించగా అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి విధానాలు, విలువలు లేవని విమర్శించారు.
వ్యవస్థీకృత వసూళ్లకు పాల్పడే సిండికేట్లు నడపడమే దానికి తెలిసిన ఏకైక విద్య అని వెటకారం చేశారు. ఇక బెంగాలీ లో వచ్చే ఎన్నికలలో బీజేపీ చేతిలో తృణమూల్ ఓటమి అని అన్నారు. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తిరిగి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెట్టేందుకు పథకాలని, ప్రత్యేక రాష్ట్రాల హామీలు ఇవ్వడం అంటూ చేస్తారని ఆ తర్వాత తుంగలో తొక్కడం ఆ పార్టీకి పరిపాటేనని అన్నారు.