Crime News: దేశం అన్ని రంగాల్లోనూ ఎంతో అభివృద్ధి చెందింది. పట్టణాలే కాకుండా పల్లెల్లో ప్రజలు కూడా సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల వారి ఆలోచనా విధానంలో కూడా మార్పులు వచ్చాయి. దేశం ఎంత అభివృద్ధి పథంలో నడుస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో మాత్రం మూఢనమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకాల కారణంగా అప్పుడప్పుడు నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల చేతబడి వల్ల ఒక గిరిజనుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషాదకర సంఘటన విశాఖ ఏజెన్సీ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..కొయ్యూరు మండలం బూదరాళ్ళ పంచాయతీలోని చీడిపల్లి గ్రామానికి చెందిన బోనంగి సోమన్న,సన్యసమ్మ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో సోమన్న కు విభేదాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా ఈ నెల 12వ తేదీ కృష్ణా రావు , మల్లన్న, మహేశ్వరరావు తో కలిసి సోమన్న బయటికి వెళ్లాడు.అలా బయటకు వెళ్లిన అతను మూడు రోజులైనా కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని భార్య ఆందోళన చెంది సదరు ముగ్గురు వ్యక్తులను తన భర్త ఆచూకీ కోసం అడిగింది. అయినప్పటికీ ఎటువంటి సమాచారం అందకపోవటంతోఈనెల 16వ తేదీన మన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సోమన్న మిస్సింగ్ గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో అనుమానం ఉన్న వ్యక్తుల పై నిఘా ఉంచారు. ఈ క్రమంలో సోమన్న అదే గ్రామానికి చెందిన కృష్ణారావు, మల్లన్న, మహేశ్వర రావు తో కలిసి ఈనెల 12వ తేదీ రాత్రి బయటకు వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు వెల్లడించింది.పోలీసులు వారి ముగ్గురుని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పెట్టారు. సోమన్న తో వారికి ఉన్న భూతగాదాలు,చేతబడి చేస్తాడు కారణంతో వారే సోమనలు హత్య చేసినట్లు అంగీకరించి శవాన్ని పూడ్చిన ప్రదేశానికి తీసుకువెళ్లారు. హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత తన భర్త ఇలా శవంగా కనిపించటంతో సన్యాసమ్మ బాధ వర్ణనాతీతంగా మారింది. ఈ విషయం గురించి పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.