Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విషయాలను అడ్డుకోవడంతో మార్కెట్లో ఈయనకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగాడు.
ఇలా పాన్ ఇండియా హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి వచ్చి అది తక్కువ సమయంలోనే ఎన్నో వ్యాపారాలను కూడా ప్రారంభించారు. ఒకవైపు హీరోగా నటించడమే కాకుండా మరొకవైపు నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఎంతో మంది కొత్తవారికి నిర్మాణంలో అవకాశం కల్పిస్తానని కెరియర్ మొదట్లో నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అలాంటివి ఇతరులు పడకుండా ఉండటం కోసమే ప్రొడక్షన్ స్థాపించానని విజయ్ దేవరకొండ పలు సందర్భాలలో తెలిపారు. ఇక ప్రొడక్షన్ మాత్రమే కాకుండా యంగ్ హీరో పలు రకాల బిజినెస్ ను కూడా ప్రారంభించారు.
ఆయన హీరోగా తెరకెక్కిన రెండు మూడు సినిమాలు సాలిడ్ హిట్ పడగానే వెంటనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. రౌడీ పేరుతో ఆన్లైన్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ లో విజయ్ మల్టీప్లెక్స్ లు కూడా ప్రారంభించారు. ఇదే కాకుండా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆ తర్వాత అతనితో కలసి ఒక హోటల్ బిజినెస్ లోకి కూడా విజయ్ దేవరకొండ అడుగుపెట్టారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించడమే కాకుండా ఇన్ని రకాల బిజినెస్లు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడుతున్నారు.