Home News మన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇవే..! తెరకెక్కిస్తారా.. వదిలేస్తారా..?

మన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇవే..! తెరకెక్కిస్తారా.. వదిలేస్తారా..?

తెలుగులో పాన్ ఇండియా సబ్జెక్టులతో దాదాపు ప్రతి స్టార్ హీరో సినిమా తెరకెక్కుతోంది. కానీ గతంలోనే దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాకు జాతీయస్థాయి డిమాండ్ ఉంది. ఇప్పుడైనా ఈ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతాయేమో చూడాలి. అలా దర్శకుల వద్ద ఉండిపోయిన కథలు, ఆగిపోయిన సినిమాలు చూద్దాం..

Td | Telugu Rajyam

రాజమౌళి: ‘మహాభారతం’ తెరకెక్కించలనేదీ ఈ దర్శకుడి డ్రీమ్. భారీ బడ్జెట్, క్యాస్టింగ్, టైమ్ పిరియడ్.. వంటి అంశాలతో ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కకు పెట్టారు.

పూరి జగన్నాధ్: ‘జనగణమన’ గురించి ప్రకటించి.. కథ రెడీ చేసి మహేశ్ తో తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేసి ఐదేళ్లు దాటింది. కానీ.. ముందుకెళ్లలేదు.

త్రివిక్రమ్: ‘కోబలి’ పేరుతో పవన్ కల్యాణ్ తో తెరకెక్కిస్తున్నట్టు ఏనిమిదేళ్ల క్రితమే వార్తలొచ్చాయి. కానీ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు. దాదాపు 25 ఏళ్ల క్రితమే త్రవిక్రమ్ రాసుకున్న కథకు అప్పట్లోనే 500 కోట్లు బడ్జెట్ తేలిందని సునీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దాని గురించి త్రివిక్రమ్ ఎప్పుడూ చెప్పలేదు.

గుణశేఖర్: గోన గన్నారెడ్డి, హిరణ్యకశిప.. ఈ రెండు సినిమాల్లో హిరణ్యకశిప రానాతో తెరకెక్కే అవకాశం ఉంది. గోనగన్నారెడ్డి ఊసు ప్రస్తుతానికి లేదు.

సుకుమార్: శ్రీలంక మత్స్యకారులు చేపల వేటలో ఎదుర్కొన్న కష్టాలతో సినిమా చేయాలని భావించారు. కానీ.. కొన్ని కారణాలతో తెరకెక్కలేదు.

కొరటాల శివ: రామ్ చరణ్ తో ఓ సినిమా ప్రారంభోత్సవం జరిగి ఆగిపోయింది. కథలో కరెక్షన్స్ ఓకే అయితే.. సినిమా రెడీనే.

రామ్ గోపాల్ వర్మ: చిరంజీవితో దొర.. ది లార్డ్ అనే సినిమా అనుకున్నా..  ఆ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు.

కృష్ణవంశీ: 1998లోనే వందేమాతరం పేరుతో చిరంజీవితో సినిమా అనుకున్నా.. బడ్జెట్ సమస్యలతో ముందుకెళ్లలేదు. రుద్రాక్ష అనే సినిమా కూడా ఇదే సమస్యతో ముందుకెళ్లలేదు.

బాలకృష్ణ: నర్తనశాల సినిమా ప్రారంభించినా.. సౌందర్య మరణంతో ఆగిపోయింది.

పవన్ కల్యాణ్: స్వీయ దర్శకత్వంలోనే సత్యాగ్రహి ప్రారంభిస్తున్నట్టు పోస్టర్ వేశారు. కానీ ఆగిపోయింది.

కోడి రామకృష్ణ: బాలకృష్ణతో విక్రమసింహ అనే సినిమా తెరకెక్కించాలని భావించినా వర్కౌట్ కాలేదు.

సురేశ్ కృష్ణ: చిరంజీవితో అబు.. బాగ్దాద్ గజదొంగ కొంతభాగం షూటింగ్ జరిగి.. ఆగిపోయింది.

జీసస్ క్రైస్ట్ జీవితచరిత్రలో ఓ భాగంతో పవన్ కల్యాణ్ తో సినిమా అనుకున్నారు నిర్మాత కొండా కృష్ణం రాజు. కానీ.. వర్కౌట్ కాలేదు.

 

Related Posts

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

బద్వేలు ఉప ఎన్నిక: వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ వుందా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ేడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (వైసీపీ)...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News