Fish Venkat: వెంటిలేటర్‌పై అలాంటి దారుణమైన స్థితిలో టాలీవుడ్ నటుడు.. నెట్టింట ఫోటోస్ వైరల్!

Fish Venkat: టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి కమెడియన్ గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ బాగా ఉన్న వెంకట్ ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీ నెమ్మదిగా దూరం అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. గతంలో కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి పట్ల అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

ఆయన కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన అనారోగ్య పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం వెంకట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఫిష్ వెంకట్ కొన్ని నెలల క్రితమే డయాలసిస్ చికిత్స తీసుకున్నారు. దీని తర్వాత బాగానే ఉన్న నటుడు ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం ఎవరినీ గుర్తు పట్టేలేనంతగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు.

ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫిష్ వెంకట్‌ ఫ్యామిలీ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే వెంకట్ పరిస్థితిని తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయనకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. అయితే ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఫిష్‌ వెంకట్‌కు డయాలసిస్‌ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అతను ఉన్న పరిస్థితుల్లో డయాలసిస్‌ తో పాటు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు. మరి కోన వెంకట్ పరిస్థితి తెలుసుకొని ఏ హీరో అయిన సహాయం చేయడానికి ముందుకు వస్తారేమో చూడాలి మరి.