Tammareddy Bharadwaj: నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత కొద్ది రోజులుగా హాస్పిటల్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని వెంటనే కిడ్నీ మార్పిడి చేయకపోతే కష్టమని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. ఇక కిడ్నీ మార్పిడి చేయాలి అంటే సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంత డబ్బు మా దగ్గర లేదని ఎవరైనా ఫిష్ వెంకట్ చికిత్సకు సహాయం చేయాలి అంటూ ఆయన భార్య కూతురు అందరిని వేడుకుంటున్నారు.
ఇకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు కేవలం విశ్వక్ మాత్రమే రెండు లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఇలా ఇండస్ట్రీ నుంచి హీరోలు ఎవరు స్పందించకపోవడంతో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల పట్ల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎవరు ఎవరికి ఫ్రీగా సర్వీస్ చేయరని ఈ సందర్భంగా తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మనకు డబ్బు రూపాయి వచ్చింది అంటే రూపాయి ఖర్చు పెట్టకూడదని ఒక పావలా రేపటి కోసం దాచి పెట్టుకోవాలని తెలిపారు.
రేపు మనకు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరికీ తెలియదు అలాంటి ఆలోచన లేకపోవడం వల్లే ఈ అబ్బాయి ఇలా ఇబ్బంది పడుతున్నారని తమ్మారెడ్డి తెలిపారు. అయినా ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడితే ముందుగా స్పందించాల్సింది ఇండస్ట్రీ కాదని గవర్నమెంట్ అంటూ ఈయన తెలిపారు. ఈ అబ్బాయి సినిమాలలో సంపాదించి ప్రభుత్వానికి కొన్ని లక్షల వరకు టాక్స్ కట్టి ఉంటారు. అలాంటప్పుడు ఈయనకు సహాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే కానీ ఇండస్ట్రీది కాదని తెలిపారు.
ఇండస్ట్రీలో పెద్ద హీరోలందరూ కూడా వారి వారి పనులలో బిజీగా ఉన్నారు. చిన్న హీరోలకు అంత సాయం చేసే స్తోమత ఉండదు. అందుకే ఎవరు పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. ఇక సహాయం చేయడం చేయకపోవడం అనేది వారి పూర్తి వ్యక్తిగతం అని కూడా తెలిపారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఫిలిం ఛాంబర్ ట్రస్ట్ ఉందని ఆ ట్రస్ట్ ద్వారా ఆర్టిస్టులకు ఏదైనా అవసరం వస్తే 25వేల రూపాయల వరకు మాత్రమే సహాయం చేసే వెసులుబాటు ఉంటుంది అంతకుమించి ఇవ్వకూడదని తెలిపారు. ఇక మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఉన్నవారికి కేవలం వైద్య పరీక్షలు మాత్రమే ఫ్రీగా నిర్వహిస్తారు తప్ప చికిత్సకు ఇన్సూరెన్స్ లేదు అంటూ తమ్మారెడ్డి తెలిపారు. ఇలా ఫిష్ వెంకట్ కి హీరోలు సహాయం చేయకపోవడం గురించి అలాగే డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకుండా పొదుపు చేసుకోవాలని కూడా సూచించారు. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
