Fish Venkat Death: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది నటుడు ఫిష్ వెంకట్ మరణించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కూడా పూర్తిగా దూరంగా ఉన్న ఫిష్ వెంకట్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఇక ఈయన రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్ళదీస్తూ వచ్చారు. ఇక ఇటీవల ఈయన అనారోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స తీసుకుంటున్నారు.
ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు మరింత క్షీణించిన నేపథ్యంలోనే మరణించారని తెలుస్తుంది. అయితే ఈయనకు రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు అందుకు 50 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు. అంతా డబ్బు తమ దగ్గర లేకపోవడంతో ఎవరైనా సహాయం చేయాలి అంటూ ఫిష్ వెంకట్ కుమార్తె ఆయన భార్య కూడా సినిమా పెద్దలను ప్రభుత్వాన్ని కోరారు.
సినిమా ఇండస్ట్రీలో ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలిసినప్పటికీ స్టార్ హీరోలు ఎవరు ముందుకు రాకపోయినా చిన్న హీరోలు మాత్రం కొంతమేర ఆర్థిక సహాయం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించడమే కాకుండా పలువురు మంత్రులు హాస్పిటల్ కి వెళ్లి ఈయనని పరామర్శించారు. ఫిష్ వెంకట్ ఆరోగ్యానికి అయ్యే ఖర్చును మొత్తం తాము భరిస్తామని అభయం ఇచ్చారు. ఇలా సర్జరీకి అయ్యే డబ్బు గురించి డోకా లేకపోయినప్పటికీ ఈయనకు సరైన సమయంలో కిడ్నీ దొరకకపోవడంతోనే ఫిష్ వెంకట్ మరణించారని తెలుస్తోంది. ఈయనకు సరిపోయే కిడ్నీ దొరికి ఉంటే ఆ ఖర్చును మొత్తం ప్రభుత్వం భరించేదని తద్వారా ఈయన ప్రాణానికి కూడా ఎలాంటి ప్రమాదం ఉండేది కాదని తెలుస్తోంది.
