మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. అహింసే ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ. తెల్లదొరలను తరిమికొట్టేందుకు అప్పట్లో ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాడారు. తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అయితే, గాంధీ అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించారు.
మహాత్ముడి జయంతి పురస్కరించుకుని ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన బాపు జీవిత సత్యాలు, ముఖ్యమైన సూక్తులు మీకోసం..
❂ అహింసకు మించిన ఆయుధం లేదు. – మహాత్మా గాంధీ
❂ ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు. – మహాత్మా గాంధీ
❂ రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు.. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాందించు. – మహాత్మా గాంధీ
❂ తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం. – మహాత్మా గాంధీ
❂ సముద్రంలో చారెడు నీళ్లు కలుషితమైతే.. సముద్రమంతా చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంటగలిసినట్టు కాదు. – మహాత్మా గాంధీ
❂ నన్ను స్తుతించే వారికంటే కఠినంగా విమర్శించే వారి వల్లనే అధికంగా లబ్ధి పొందుతా. – మహాత్మా గాంధీ
❂ ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి. – మహాత్మా గాంధీ
❂ మేధావులు మాట్లాడుతారు.. అదే మూర్ఖులైతే వాదిస్తారు. – మహాత్మా గాంధీ
❂ ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి. – మహాత్మా గాంధీ
❂ మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే. – మహాత్మా గాంధీ
❂ బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి. – మహాత్మా గాంధీ
❂ ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి.. ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. – మహాత్మా గాంధీ
❂ విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలి పోయేది కాదు.. అది అచంచలమైనది. హిమాలయాలంత స్థిరమైనది. – మహాత్మా గాంధీ
❂ చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ, మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం. – మహాత్మా గాంధీ
❂ అంతరాత్మ ‘ఇది తప్పు’ అని చెప్పినా, ఇతరుల మెప్పు కోసమో, తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం. – మహాత్మా గాంధీ
❂ ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో..
ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో – మహాత్మా గాంధీ
❂ కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. – మహాత్మా గాంధీ
❂ పుస్తకం గొప్పతనం అందులోని విషయాలపై ఆధారపడదు.