Kubera Movie: తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. దాదాపుగా 265 మందికి పైగా మరణించడంతో పాటు మృతుల సంఖ్య గంటకు పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఆ విమానం మెడికల్ కాలేజీ పై కుప్పకూలి భారీగా పేలుడు సంభవించడంతో మెడికల్ కాలేజీలో ఉన్న వారు కూడా దాదాపుగా 20 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. భారీగా ప్రాణం నష్టం ఆస్తి నష్టం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించే చర్చించుకుంటున్నారు.
అలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి శాంతి చేకూరాలని కోరుకోవడం తో పాటు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర మూవీ మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే నేడు అనగా జూన్ 13వ తేదీన హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది.
కానీ అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా ఈ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. దేశం మొత్తం దుఃఖంలో ఉండగా తామా కుబేర వేడుకను చేయలేమని వారు తెలిపారు. అభిమానులు దీనిని గ్రహిస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ధనుష్,నాగార్జున, రష్మిక కలిసి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ నెల 20న విడుదల కానుంది. శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.