Today Horoscope : ఫిబ్రవరి 23rd మంగళవారం మీ రాశి ఫలాలు

today-february-23rd-2021-daily-horoscope-in-telugu

మేష రాశి  : వ్యాపారాలు కలిసివస్తాయి !

పలుకుబడి పెరుగుతుంది.ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సంపదను ప్రయోజకరంగా వినియోగిస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. అంచనాలు నిజమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. పెట్టుబడులు పెట్టడం వల మీకు లాభాలు వస్తాయి. ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.
 

వృషభ రాశి : సమాజంలో గౌరవం !

ఈరోజు తీరిక లేకుండా గడిచిపోతుంది. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు పనిని ఇష్టంగా చేయండి. ఎన్ని పనులున్నా, ఆటంకాలు ఎదురవుతున్న సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతారు. దైవదర్శనాలు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. బ్రమరాంబికాష్టకం పారాయణం చేసుకోండి.

మిధున రాశి : పిల్లల నుంచి శుభ వార్తలు !

ఇంటాబయటా అనుకూలం.ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల వైపు నుంచి శుభ వార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈరోజు కొంత కష్టపడ్డా మీకు ఫలితం దక్కుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి : ఉద్యోగులకు పనిభారం !

ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఎక్కువ అడ్డంకులు వస్తుంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి. ఈరోజు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

సింహ రాశి : ఈరోజు పనులు పూర్తి !

ఈరోజు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఉద్యోగంలో మౌనంగా ఉండడం ఈరోజు మీకు కలిసొచ్చేలా చేస్తుంది. ఈరోజు వ్యాపారాలు విస్తరిస్తారు. ఈరోజు సన్నిహితులు మద్దతు ఇస్తారు. విందువినోదాలు. ఆటంకాలు ఎదురవుతున్న పనులను పూర్తి చేయడానికి సిద్ధపడతారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.
 

కన్య రాశి : వ్యాపారాలు పుంజుకుంటాయి !

ఈరోజు కార్యాలయంలో పునరావాసం పొందుతారు. కొత్త పనులు చేపడతారు. కెరీర్లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు ఆభరణాలు, వాహనాలు కొంటారు. వ్యాపారంలో సన్నిహితులతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థికాభివృద్ధి. ఈరోజు వ్యాపారాలు పుంజుకుంటాయి. రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today-february-23rd-2021-daily-horoscope-in-telugu
today-february-23rd-2021-daily-horoscope-in-telugu

తులా రాశి : బంధువులతో తగాదాలు !

ఈరోజు బంధువులతో తగాదాలు. మీకు సంపద, ఉల్లాసం లభిస్తుంది. ఈరోజు ప్రత్యేకమైన సహకారం అందుతుంది. ఈరోజు ఆలోచనలు నిలకడగా ఉండవు. నిపుణుల సలహాల వలన మీరు మీ పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యభంగం. ఈరోజు అన్ని రకాల వ్యాధుల నుంచి బయట పడగలుగుతారు. లక్ష్మీ అష్టకం పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి : ఈరోజు సంతోషంగా గడుపుతారు !

ఈరోజు మనసులో సంతృప్తి కరంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు. మీ సన్నిహితుల సలహాలు, మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులను సరైన క్రమంలో పూర్తి చేస్తారు. ఈరోజు ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. భార్య పిల్లలతో సంతోషంగా సమయం గడుపుతారు. దత్తాత్రేయ పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి : కుటుంబ సభ్యులతో సంతోషం !

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం పై దృష్టిని ఉంచండి. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనవసర గొడవల్లో తల దూర్చద్దు. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి : భూవివాదాల పరిష్కారం !

ఈరోజు శుభప్రదంగా గడుస్తుంది. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూవివాదాల పరిష్కారం. మీ పనుల కోసం ఇతరులపై ఆధార పడకండి. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

కుంభ రాశి : సమస్యలను పరిష్కరించుకుంటారు !

ఈరోజు మీ కోరికలను నెరవేర్చుకోగలరు. సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజు ఉద్యోగయత్నాలలో అవాంతరాలు.కుటుంబ సభ్యులతో ఉల్లసముగా గడుపుతారు. మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

మీన రాశి : ఉద్యోగాలలో మార్పులు !

ఈరోజు బంధు, మిత్రులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పట్టు విడవకుండా పనులను పూర్తి చేస్తారు. మీ పట్టుదలే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. ఈరోజు ఉద్యోగాలలో మార్పులు. శ్రీహయగ్రీవ అష్టోత్తర పారాయణం చేసుకోండి.