తగ్గుతున్న కరోనా.. రెండు వేల దిగువకు కేసులు

దేశంలో కరోనా ప్రభావం తగ్గుతోంది. రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య రెండు వేల దిగువగా నమోదవుతోంది. కొత్తగా 1,761 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. అయితే, మరణాలు సంఖ్య మాత్రం పెరిగింది. కొత్తగా మరో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,196 మంది వైరస్​నుండి కొలుకున్నారు. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. శనివారం మరో 15,34,444 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,81,21,11,675 కు పెరిగింది.