వాళ్లకి తగ్గించి మాకు పెంచండి’ జగన్‌కు సొంత క్యాడర్ సీరియస్ రిక్వెస్ట్ 

Reddy community request to CM YS Jagan
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు కొద్దిగా మారింది.  ఈమధ్య సొంత సామాజిక వర్గానికి ఆయన ప్రాధాన్యం కొంత తగ్గించారు.  ఫలితంగా పార్టీని నమ్ముకున్న రెడ్డి సామాజిక వర్గం చిన్నబుచ్చుకుంది.  జగన్ సీఎం అయ్యాక తన మంత్రి వర్గంలో రెడ్లతో పాటే అన్ని సామాజిక వర్గాలకు సమానమైన ప్రాధాన్యం కలిగించారు జగన్.  అలా చేయడం తప్పదు కాబట్టి రెడ్డి నేతలు కష్టంగా ఉన్నా మౌనం పాటించారు.  ఆ తర్వాత పలు పదవులకు, కీలక బాధ్యతలకు రెడ్డి నేతల నుండే ఎక్కువ మందిని ఎంపిక చేశారు. 
Reddy community request to CM YS Jagan 
 
ఏపీఐఐసీ చైర్మ‌న్ పదవికి రోజా రెడ్డి, సీఆర్డిఎ చైర్మన్ గా ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, తుడా చైర్మ‌న్ గా చెవిరెడ్డి భాస్క‌ర‌ రెడ్డి, టీటీడీ చైర్మ‌న్‌ పదవిలో వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ స‌ల‌హాదారుగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, వ్యవసాయ మిషన్‌ వైస్ చైర్మ‌న్‌ గా ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సంస్క‌ర‌ణ‌ల‌ క‌మిటీకి భూమి రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ పదవిలో విజయ సాయి రెడ్డి అలాగే పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి, లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ గా  పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లోక్ సభలో పార్టీ నేతగా మిథున్ రెడ్డి, ఢిల్లీలో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా విజ‌య‌ సాయి రెడ్డిని సెలెక్ట్ చేశారు.  
 
ఇక జిల్లాల వారీగా బాధ్యతలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి,  విజయసాయి రెడ్డిలకే అప్పగించారు.  దీంతో పార్టీలో బయట కూడా రెడ్డి వర్గం చేతిలోనే పార్టీ, ప్రభుత్వం ఇరుక్కుపోతోందనే విమర్శలు మొదలయ్యాయి.  ప్రతిపక్షాలు కూడా రెడ్లు రెడ్లు ఊళ్లు పంచుకుంటున్నారని ఆరోపణలు చేశారు.  దీంతో జగన్ పరిస్థితిని కాస్త మారిస్తే బాగుంటుందని బీసీ వర్గానికి ప్రాధాన్యం పెంచారు.  నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవుల్లో బీసీలకే పెద్ద పీఠ వేశారు.  రాబోయే రోజుల్లో జరగబోయే మంత్రి వర్గం మార్పుల్లో కూడా సామాజిక వర్గం లెక్కలు పనిచేస్తాయని జగన్ సంకేతాలిస్తున్నారు.  
 
దీంతో రెడ్డి వర్గంలో అగ్గి రాజుకుంటోంది.  ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఇప్పుడు నిరాశ మిగుల్చుకోవాల్సి వస్తోంది అంటూ నిష్టూర పోతున్నారట.  అధికారంలో లేనప్పుడు జగన్ వెంట ఉన్నది, అన్ని విధాలా పార్టీని నడిపిన మాకు ఏ విషయంలో అయినా మొదటి ప్రాధాన్యత ఉండాలి.  కానీ పార్టీలో సామాజిక సమీకరణాల పేరుతో మమ్మల్ని వెనక్కి నెడుతున్నారని, ఇప్పటికైనా బీసీ మంత్రాన్ని పక్కనబెట్టి జగన్ తమకు ప్రాధాన్యం పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నారట.  మరి వారి విఙ్ఞప్తిని జగన్ పట్టించుకుంటారేమో చూడాలి.