Fatigue: తొందరగా అలసిపోతున్నారా… అలసట నుంచి బయట పడాలంటే ఈ చిన్న పని చేయాల్సిందే!

Fatigue: అలసట అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి లోను కనిపించే మొదటి సమస్య. ఈ సమస్య కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు తొందరగా అలసిపోవడం గమనిస్తూ ఉంటాము. అలాగే చిన్న చిన్న పనులకు కూడా తొందరగా అలసి పోతాము.అలాంటి ఈ అలసటను ఏ విధంగా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం….

మామూలుగా అలసట అనేది ఎక్కువ పనులు చేయడం కారణంగా, శారీరక శ్రమ ఎక్కువ అవడం వలన జరుగుతూ ఉంటుంది . అలసట కారణంగా ఏ పనులను కూడా త్వరగా చేయలేక పోతున్నాము. దీని కారణంగా అన్ని పనుల్లోనూ వెనుకబడి పోతున్నాము.

అలసట అన్నది హార్మోన్ల అసమతుల్యత కారణంగాను,శారీరక కండరాలలో ఉండే కొవ్వు తీవ్రత వలన కూడా అలసట వచ్చే అవకాశం ఉందట ఈ అలసట కారణంగా మనం మన పనులను కూడా చేసుకోలేక పోతున్నాము

ఈ అలసటను మనం మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ, వ్యాయామం,యోగా అలాగే సూర్య నమస్కారాలు వంటివి, వీటితో పాటు ఎక్కువ నీటిని, ఆకుకూరలు వంటివి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుందట. జీర్ణక్రియ బాగా పని చేయడం వలన చురుగ్గా మన పనులను కూడా చేసుకోవచ్చును ఈ విధంగా మనం జాగ్రత్తలను తీసుకోవడం వలన ఈ అలసటను దూరం చేసుకునే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.