టిక్ టాక్ ను ఆ దేశంలో కూడా బ్యాన్ చేశారు.. టిక్ టాక్ కు దెబ్బ మీద దెబ్బ

tik tok banned in pakistan

టిక్ టాక్ గురించి మన దేశంలో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. టిక్ టాక్ కు అంత పాపులారిటీ వచ్చింది ఇండియాలోనే. టిక్ టాక్ యాప్ ప్రపంచం మొత్తం మీద ఇండియాలో ఎక్కువ యూజర్లు, ఎక్కువ వీడియోలు, ఎక్కువ వ్యూస్ తెచ్చుకొని సరికొత్త రికార్డును సృష్టించింది. అందుకే భారతీయులకు టిక్ టాక్ తో అనుబంధం ఎక్కువ. అందులోనూ తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి చూపించడానికి టిక్ టాక్ ఓ వేదిక అయింది.

tik tok banned in pakistan
tik tok banned in pakistan

అయితే.. ఆ యాప్ వల్ల భారత యూజర్ల డేటా దుర్వినియోగం అవుతోందని భావించిన కేంద్ర ప్రభుత్వం.. టిక్ టాక్ యాప్ ను ఇండియాలో బ్యాన్ చేసింది. నిజానికి టిక్ టాక్ చైనా దేశానికి చెందిన యాప్.

భారత్ తర్వాత యూఎస్ కూడా ఆ యాప్ ను బ్యాన్ చేసింది. తాజాగా.. టిక్ టాన్ ను తమ దేశంలో బ్యాన్ చేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ టెలీకమ్యునికేషన్ అథారిటీ టిక్ టాక్ నిషేధంపై ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. ఈ యాప్ లో అనైతిక, అసభ్యకరమైన ఇన్ఫర్మేషన్ కు వ్యతిరేకంగా చాలా ఫిర్యాదులు రావడంతో తప్పని పరిస్థితుల్లో యాప్ ను బ్యాన్ చేస్తున్నట్టు అథారిటీ ప్రకటించింది.

పాకిస్తాన్ లో టిక్ టాప్ యాప్ ను 39 మిలియన్ల మంది డౌన్ లోన్ చేసుకున్నారు. అంటే.. 3 కోట్ల 9 లక్షల మంది యూజర్లు టిక్ టాక్ ఉన్నారు.