Tanikella Bharani: తనికెళ్ల భరణిని చంపేస్తామంటూ బెదిరింపులు.. అసలేం జరిగిందంట?

Tanikella Bharani: తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు, దర్శకుడు, రచయిత అయిన తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగు లోనే కాకుండా కన్నడ, హిందీ, భాషలలో సుమారు 750 చిత్రాలకు పైగా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తండ్రి పాత్రలో తాత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు తనికెళ్ల భరణి. ఇక సినిమాల లోని నటీనటులను ఎంత మంది ఇష్టపడే వారు ఉంటారు అంతే మంది తిట్టే వారు కూడా ఉంటారు. సినిమాలలో కొన్ని కొన్ని పాత్రలు కొంతమందికి నచ్చవచ్చు. మరికొంత మందికి నచ్చకపోవచ్చు.

ఇది ఇలా ఉంటే తాజాగా తనికెళ్ల భరణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూ లో భాగంగా తిట్టేవాళ్ళు, మెచ్చే వాళ్ల గురించి పక్కన పెడితే.. నన్ను చంపేస్తామని కూడా బెదిరించారు అని తెలిపారు తనికెళ్ల భరణి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఊహ హీరోయిన్ గా నటించిన ఆమె అనే సినిమా తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. అందులో హీరోయిన్ ఊహ బావ క్యారెక్టర్ లో తనికెళ్ల భరణి నటించారు. ఈ సినిమా లో భాగంగా కొద్దిగా బ్యాడ్ విలనిజం చూపించిన తనికెళ్ల భరణి హీరోయిన్ ఊహను అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటాడు.

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్రకు మంచి పేరు రావడం సంగతి పక్కన పెడితే.. బయట తనను ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టడానికి ప్రయత్నించారని.. కొంతమంది మహిళలు అయితే చంపేస్తామని బెదిరించారు అంటూ చెప్పుకొచ్చారు తనికెళ్ల భరణి. అది అంత సినిమా అమ్మ.. నిజం కాదు..అని చెప్పినా కూడా వారు నమ్మే వారు కాదు అని తెలిపారు. అంతలా సినిమాలలోని క్యారెక్టర్ లకు కనెక్ట్ అయిపోయారు అని తెలిపారు తనికెళ్ల భరణి.