Omicron: ఒమిక్రాన్ తో పిల్లలకి పెరిగిన ముప్పు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు..!

Omicron: కరోనా రెండు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. చైనాలో ఉద్భవించిన ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించి అతలాకుతలం చేసింది.ప్రస్తుతం భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని దేశాలలో మాత్రం కరుణ విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం కరోనా “ఎక్స్ ఈ” కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఐతే కరోనా మూడవ వేవ్ లో వచ్చిన ఒమిక్రాన్ కారణంగా పిల్లల్లో గుండె సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చిస్తున్నారు.

అమెరికాలోని కొలరాడో, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ, స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలు చేసిన అద్యనం ప్రకారం
ఒమిక్రాన్ వేరియంట్ పిల్లల్లో అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్‌ను కలిగించే అవకాశం ఎక్కువ ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు.  డెల్టా వేరియంట్ తో పోల్చితే ఒమిక్రాన్ ఊపిరితిత్తుల మీద తక్కువ ప్రభావ చూపుతుంది. ఒమిక్రాన్ ఊపిరితిత్తుల మీద కంటే ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.

ఒమిక్రాన్ కారణంగా రెండేళ్లలోపు పిల్లలు అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేషనల్ కోవిడ్ కొహర్ట్ కొలాబరేటివ్‌ నుంచి 19 ఏళ్లలోపు 18,849 మంది చిన్నారుల మీద పరిశోధన చేయగా అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ కారణంగా పిల్లల్లో హార్ట్ ఎటాక్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తు తున్నయని పరిశోధకులు వెల్లడించారు .