ఈ ఆధునిక జీవన శైలిలో చాలా మందిని బాధ పెడుతున్న సమస్య అధిక బరువు. ఈ మధ్యకాలంలో చాలామంది వారి శరీర బరువును తగ్గించుకొని ఫిట్ గా కనపడడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అధిక బరువు ఉండటం వలన అందవిహీనంగా కనిపించడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. మన ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అనేది అందరికీ చాలా ముఖ్యమైనది. మెటబాలిజంని పెంచడానికి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ సాంబార్ ఒక వారం పాటు తింటే మీ జీర్ణశక్తి చాలా మెరుగు పడుతుంది. సాంబార్ లో ఉండే పప్పు వల్ల ఎక్కువ ప్రోటీన్ లభించి చాలాసేపు ఆకలి అవ్వదు. దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగా పని చేయడమే కాక బరువు తగ్గుతారు.
రాగులలో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వలన అది తిన్న తర్వాత మనకు త్వరగా ఆకలి వేయదు. రాగులు తినడం వలన గుండె సంబంధిత వ్యాధులు రావు. అధిక బరువు, ఇంకా డయాబెటీస్ సమస్యలు కూడా కంట్రోల్ లో ఉంటాయి. యాపిల్ తినడం వల్ల కూడా మన బాడీ వెయిట్ ని కంట్రోల్లో ఉంచవచ్చు. యాపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఆపిల్ తిన్న తర్వాత చాలాసేపు ఆకలి వేయదు. ఇలా చేయటం ద్వారా కూడా మీ బరువుని కంట్రోల్లో ఉంచుకోండి.
అధిక మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోవడం వలన అధిక బరువు సమస్య తగ్గుతుంది.రోజుకు రెండు టీ స్పూన్ల మోతాదులో వెనిగర్ తీసుకుంటే 30 రోజుల్లో దాదాపు రెండున్నర కిలోల బరువు తగ్గుతాం. అయితే ఏదైనా ద్రవ పదార్ధాలు, సలాడ్స్ లాంటి వాటిపై వేసి తీసుకోవడం మంచిది.