మూడు పదుల వయసులో ఉన్న వాళ్లు తప్పకుండా ఇవి పాటించాల్సిందే!

ఇప్పుడు మన బిజీ లైఫ్ లో చాలా మంది తమతమ వ్యక్తిగత కార్యకలాపాలను పక్కన పేట్టి, తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. అలాంటి వారు వీటిని రోజు వారి డైట్ తో పాటు తీసుకుంటే చాలా ఆరోగ్యంగ ఉంటారు.
పూర్వము మన ముందు జనరేషన్ వాళ్ళు..100 సంవత్సరాలు బతికే వారు అని వినుంటారు. పెరుగుతున్న శ్రమ, మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల మనిషి 30 సంత్సరాల నుండి వ్యాధులకు గురవుతున్నారు. 30 సంవత్సరాలలో ఉన్న వారు ఇకనుండి అయిన కింద సూచించిన ఆహారము అలవాట్లను పాటించటం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుగా ఉంచుకొగలుగుతారు. అవేంటో ఒక లుక్ వేయండి.

సోయాబీన్: సోయాబీన్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది దీనిలో శరీరానికి అవసరమైన ప్రోటీన్ లు దొరుకుతాయి. సోయాబీన్ అనేది ఎముకల్ని చాలా దృఢంగా చేస్తుంది. రోజుకి ఒకసారైనా సోయాబీన్ తీసుకుంటే మీరు ఆరోగ్యం కాపాడుకున్నట్టే.

బ్రోకలీ: ఇది చూడటానికి మీకు కాలీఫ్లవర్ లాగా అనిపిస్తుంది కాకపోతే గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇందులో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జలుబు బారిన పడకుండా కాపాడుతుంది, ఇంకా ఇమ్మునిటీనీ కూడా పెంచుతుంది.

గ్రీన్ పీస్: గ్రీన్ పీస్ లో శరీరానికి అవసరమైన ప్రోటీన్, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇంక కాల్సియం, మెగ్నీషియం, జింక్, కాపర్, పాస్పరస్ మొదలైనవి అందుతాయి. ఒక పీస్ లో 5 గ్రాముల శరీరానికి అవసరమైన ప్రోటీన్ ఉంటుంది.

ఫిష్: ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది, 100 గ్రాముల చేపలో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. హార్ట్ వర్కింగ్ కి బ్రెయిన్ నీ చాలా ఆరోగ్యంగా ఉంచడానికి చేపలు బాగా ఉపయోగపడతాయి. 30 ఏళ్లు ఆపైబడిన వాళ్ళు ఈ చిట్కాలను పాటిస్తే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం అవుతుంది.