మణిరత్నం భారీ సినిమా “పొన్నియిన్ సెల్వన్” ఓటిటి డీల్ ఎవరికీ అంటే.!

ఇప్పుడు ఓ రేంజ్ లో మన తెలుగు సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రైజ్ అవుతుంది. దీనితో అటు హిందీ సహా తమిళ్ ఆడియెన్స్ తమ సినిమాల సత్తా కూడా చాటాలని చూస్తున్నారు. కానీ వారి నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమాలు కూడా ఆకట్టుకోవడం లేదు.

ఇక ఇప్పుడు అన్ని అసలు అయితే తమిళ్ నుంచి అవైటెడ్ సినిమా “పొన్నియిన్ సెల్వన్” కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ పీరియాడిక్ హిస్టారికల్ సినిమాతో కోలీవుడ్ తప్పకుండా షైన్ అవుతుంది అని తమిళ ప్రేక్షకులు ఆశగా ఉన్నారు.

ఇక రీసెంట్ గా వచ్చిన టీజర్ లు కూడా మంచి రెస్పాన్స్ నే అందుకున్నాయి. ఇలా ప్రతి అంశాన్ని గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్న మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా ఓటిటి హక్కులు ఎవరికీ అమ్మారో తెలుస్తుంది. తెలియడం కాదు కన్ఫర్మే అయ్యింది. ఈ సినిమాని ప్రముఖ సంస్థ అమేజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుక్కున్నారు. తమిళ్ సహా హిందీ తెలుగు అన్ని భాషల్లో కూడా భారీ ధర ఇచ్చిన ఈ హక్కులను వారు కొనుగోలు చేశారట. దీనితో ఈ డీల్ వీరికి సొంతం అయ్యింది.

ఇంకా ఈ సినిమాలో విక్రమ్ మెయిన్ హీరోగా నటించగా కార్తీ, జయం రవిలు కీలక పాత్రల్లో నటించారు. అలాగే త్రిష మరియు ఐశ్వర్య రాయ్ లు హీరోయిన్స్ గా నటించారు. ఇంకా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.