Home News ఎలక్షన్ తరవాత చంద్రబాబు కి ఒకే ఒక్క గుడ్ న్యూస్ ఇది !

ఎలక్షన్ తరవాత చంద్రబాబు కి ఒకే ఒక్క గుడ్ న్యూస్ ఇది !

 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కదిలిస్తే చాలు హైదరాబాద్ ను నేను నిర్మించాను, హైటెక్ సిటీని నేనే కట్టించాను , నేను లేకపోతే హైదరాబాద్ మహా నగరం లేదన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు, తాజాగా భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జెనోమ్ వ్యాలీని సంద‌ర్శించిన సమయంలో జెనోమ్ వ్యాలీకి తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకొని పొంగిపోయాడు చంద్రబాబు నాయుడు.

Chandrababu Naidu

 మూడు ద‌శాబ్దాల క్రితం నా విజ‌న్ నేడు నిజ‌మైంద‌ని, నేను పునాది వేసిన జెనోమ్‌వ్యాలీలో భార‌త్ బ‌యోటెక్ కంపెనీ క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ త‌యారు చేయ‌డం నా క‌ల‌ల ప్రాజెక్టు ఫ‌లించింద‌నేందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. దేశంలో బ‌యోటెక్ అనే ప‌దం కొత్త‌గా వినిపిస్తున్న 1990 రోజుల‌లో హైద‌రాబాద్‌లో జెనోమ్ వ్యాలీకి అంకురార్ప‌ర‌ణ చేశామ‌ని, ఇప్పుడు అందులో 150కిపైగా ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాత లైఫ్ సైన్సెస్‌ కంపెనీలు రిసెర్చ్ అండ్ డెవ‌ల‌జ్‌మెంట్ విభాగాల‌ను నిర్వ‌హిస్తూ జెనోమ్ వ్యాలీ బ‌యోటెక్ హ‌బ్‌గా మారిందని,క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాక్సిన్ త‌యారీకి జెనోమ్ వ్యాలీ కేంద్రం కావ‌డం, దూర‌దృష్టితో చేసే ప‌నులు భావిత‌రాల‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయో మ‌రోసారి నిరూపించింద‌న్నారు.

 వైద్యారోగ్య అవ‌స‌రాలు తీర్చే జెనోమ్ వ్యాలీలో కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయ‌ని, మౌలిక వ‌స‌తుల‌కు క‌ల్ప‌న‌కు కృషి చేస్తున్నాయ‌ని చెప్పారు. అయితే హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు నిర్మించాడా..? లేడా అనే విషయాన్ని పక్కన పెడితే జెనోమ్ వ్యాలీ విషయంలో మాత్రం క్రెడిట్ బాబుకు ఇవ్వాల్సిందే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జెనోమ్ వ్యాలీ కు శంకుస్థాపన జరిగింది కాబట్టి ఈ విషయంలో ఎవరు బాబు మాటలను డాబు కోసం చెప్పాడని అనుకోవటానికి లేదు.

 ఈ వయస్సులో బాబుగారికి కూడా కావాల్సింది ఇలాంటి మాటలే. ఆంధ్రాలో పార్టీని ఎలా ముందుకు నడపాలో తెలియక కింద మీద అవుతున్నాడు, ఇటు తెలంగాణాలో చూస్తే పార్టీ ఉందొ లేదో కూడా తెలియటం , ఇక గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ఓడిపోతామని తెలిసిన పొడిచేస్తున్నాడు. ఆ ఓటమి తర్వాత కొంచం మనోదైర్యానికి ఇలాంటి మాటలు అవసరమే

- Advertisement -

Related Posts

నరాలు తెగే ఉత్కంఠ: నిమ్మగడ్డ, వైఎస్ జగన్.. గెలిచేదెవరు.?

గంటలు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో చాలామందిలో నరాలు తెగే ఉత్కంట పెరిగిపోతోంది. వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారా.? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

2021లో శృతి హాస‌న్ పెళ్లి.. ఈ ప్ర‌శ్న‌పై క‌మ‌ల్ గారాల ప‌ట్టి ఎలా స్పందించిందంటే!

గ‌త ఏడాది నుండి ఇండ‌స్ట్ర‌లో పెళ్ళిళ్ల హంగామా మ‌స్త్ న‌డుస్తుంది. రానా, నితిన్, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌, సుజీత్ , సునీత ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు న‌చ్చిన వారితో ఏడ‌డుగులు...

పవ‌న్‌ను ఆపలేక చేతులెత్తేసిన వైసీపీ.. మళ్ళీ చంద్రబాబు దగ్గరికే చేరారు 

ఒక వ్యక్తి మీద ఒక విషయంలో ఒక విమర్శ చేయవచ్చు. జనం కూడ దాన్ని వింటారు, పట్టించుకుంటారు.  కానీ అదే వ్యక్తి మీద అన్ని విషయాల్లోనూ ఆ ఒక్క విమర్శనే మళ్ళీ మళ్ళీ...

తూ.గో.జిల్లాను దడదడలాడిస్తూనే ఎమ్మెల్యే.. వైసీపీ నేతలు సైతం సైలెంట్ 

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జగన్ అండ చూసుకుని హద్దులు దాటిపోతున్న సంగతి తెలిసిందే.  ఇలాంటివారి మూలంగా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలే ఇబ్బందులుపడుతున్నారు.  బయటివారినే కాదు సొంత పార్టీ నేతలను కూడ ఈ ఎమ్మెల్యేలు లెక్కచేయట్లేదు.  అంతా...

Latest News