Health Tips: కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఈ పండు తప్పనిసరిగా తినాలి..!

Health Tips: 2 సంవత్సరాల క్రితం చైనాలో ఉద్భవించిన కరుణ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఒకరి నుండి ఒకరికి వ్యాపించే ఈ వ్యాధి అతి తక్కువ కాలంలోనే దేశాలన్నింటిలో వ్యాపించి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. కరోనా వ్యాధిని నివారించడానికి ప్రభుత్వాలు వ్యాక్సిన్లు అందించినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు.కొత్త కొత్త వేరియంట్లలో రూపంతో ప్రజల మీద దాడి చేస్తున్న ఈ కరోనా కారణంగా లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

భారతదేశంలో కరోనా కేసులు కొంచెం తగ్గుముఖం పట్టాయని ఊపిరిపీల్చుకున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ‘ఎక్స్‌ ఈ’ కేసులు నమోదవుతున్నాయి.కరోనా కేసులు వ్యాపించడానికి ముఖ్యకారణం ప్రజలలో రోగనిరోధక శక్తి లేకపోవటమే.శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కొన్ని రకాల పండ్లు కూరగాయలు ఎంతో ఉపయోగపడతాయి.అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో బొప్పాయి పండు ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

బొప్పాయి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ డి కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు జలుబు జ్వరం వంటి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడటమే కాకుండా కరోనా వైరస్ వంటి వ్యాధులు సోకిన కూడా ఎటువంటి ప్రాణ హాని కలగకుండా ఉంటుంది. బొప్పాయి పండులో ఉండే పొటాషియం , ఫైబర్ , అనేక రకాల విటమిన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే బొప్పాయి పండు ఎక్కువగా తినటం వల్ల సరిగా జీర్ణం కాక అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.