ఫ్యాన్స్ ఎమోషన్స్ పట్టించుకోని బడా నిర్మాత..ఘాటు స్పందన.!

టాలీవుడ్ లో బడా నిర్మాతలు ఎందరో ఉన్నారు. అయితే ఎంత నిర్మాతలు అయినా హీరోలు అయినా సినిమాలు చేసినా అది తమ బిజినెస్ కోసం అభిమానుల కోసమే.. కానీ అభిమానుల ఫీలింగ్స్ ని దాటి తనకి బిజినెస్ డబ్బులు మాత్రమే ముఖ్యం అని ఓ టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వారి అభిమానులని హర్ట్ చేస్తున్నాయి.

అయితే ఈ నిర్మాతకి చెందిన రీసెంట్ సినిమా కొన్ని రోజులు కితమే ఓటిటిలో వచ్చింది, దానికి ముందు ఓ సినిమా కూడా ఓటిటి లోనే రిలీజ్ చేసారు. దీనితో వారి హీరో అభిమానులు చాలా బాధ పడ్డారు. మరి ఈ ప్రశ్ననే మీడియా ముఖంగా ఆయన్ని అడగ్గా ఘాటు రిప్లై ఇచ్చేసారు.

నాకు నేను పెట్టిన డబ్బులు తిరిగి రావడం మాత్రమే ముఖ్యం మిగతా కామెంట్స్ విషయాలు కోసం నాకు అనవసరం అని చెప్పేసారు. అంటే ఇక అందులో అభిమానుల ఎమోషన్స్ కూడా పట్టించుకోనట్టే కదా? సో ఇక ముందు సినిమాలు కూడా ఓటిటిలోనే రిలీజ్ చేసుకుంటారేమో చూడాలి.